త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీక మొహరం | - | Sakshi
Sakshi News home page

త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీక మొహరం

Jun 27 2026 1:49 AM | Updated on Jun 27 2026 1:49 AM

త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీక మొహరం

పార్వతీపురం: మొహరం పర్వదినం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలందరికీ కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు శుక్రవారం తెలిపారు. మొహరం త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే పవిత్ర పర్వదినమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావం మరింత బలోపేతం కావడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయని అన్నారు. ప్రజందరూ మోహరం పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో పరస్పర గౌరవంతో జరుపుకోవాలని కోరారు. ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మొహరం శుభాకాంక్షలను తెలిపారు.

స్పెషల్‌ క్యాంపెయిన్‌ డేస్‌గా నేడు, రేపు

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌–2026) కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27, 28 తేదీలను ‘స్పెషల్‌ క్యాంపెయిన్‌ డేస్‌’గా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి శుక్రవారం తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు నమోదు ప్రక్రియలో సేకరించిన ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసేందుకు జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో బూత్‌ లెవెల్‌ అధికారులు ఈ రెండు రోజులు ప్రత్యేకంగా అందుబాటులో వుండి కార్యక్రమం చేపడతారని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement