సంక్షేమానికి.. సాంకేతిక సంక్షోభం..! | - | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి.. సాంకేతిక సంక్షోభం..!

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

సంక్షేమానికి.. సాంకేతిక సంక్షోభం..! ● సంక్షేమ పథకాలకు ఈకేవైసీతో ముడి ● మన్యంలో ఆన్‌లైన్‌ సమస్యలు... సాంకేతిక ఇబ్బందులు ● ఈకేవైసీకి సచివాలయాలు, ఆధార్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న జనం ● ఆన్‌లైన్‌ బూచితో సంక్షేమానికి సర్కారు ఎగనామం ఇదీ పరిస్థితి

పథకం ప్రహసనంగా...

● సంక్షేమ పథకాలకు ఈకేవైసీతో ముడి ● మన్యంలో ఆన్‌లైన్‌ సమస్యలు... సాంకేతిక ఇబ్బందులు ● ఈకేవైసీకి సచివాలయాలు, ఆధార్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న జనం ● ఆన్‌లైన్‌ బూచితో సంక్షేమానికి సర్కారు ఎగనామం

పాలకొండ రూరల్‌:

ప్రభుత్వం అమలు చేస్తున్న అరకొర సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందడం గగనంగా మా రింది. జిల్లాలో సాంకేతిక సమస్యలు లబ్ధిదారులకు శాపంగా మారాయి. సిగ్నల్స్‌ లేకపోవడం, ఈకేవైసీ అవరోధాలు సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చుతున్నాయి. గతంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించేవారు. లబ్ధిదారులకు పథకం లబ్ధి ఠంచన్‌గా చేకూర్చేవారు. రెండేళ్లుగా ఆ పరిస్థితి లేదు. ఎంతమంది లబ్ధిదారులు తగ్గుతారా అన్న ధోరణి లో సర్కారు వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపి స్తున్నాయి. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధా నం కాకపోవడం, ఈకేవైసీ కాకపోవడంతో రేషన్‌, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు అర్హులు దూరమవుతున్నారు. దీంతో ఈకేవైసీ కోసం సచివాలయాలు, ఆధార్‌ సెంటర్ల వద్ద మన్యం ప్రజలు బారులు తీరుతున్నారు.

జిల్లాలో 2.73 లక్షల మంది రేషన్‌ లబ్ధిదారు ఉండగా వీరిలో 14 వేల పైచికులు మంది ఈకేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం వీరికి సరుకులు అందడం లేదు. గ్యాస్‌ సరఫరాలో కూడా వినియోగదారుడు సిలిండర్‌ బుక్‌చేసిన వెంటనే వారి సెల్‌కు ఓటీపీ వస్తుంది. వినియోగదారులు తప్పనిసరిగా తమ వివరాలు రిజిస్టర్‌ చేయించుకోవాలని సదరు ఏజెన్సీలు సెల్‌ నంబర్‌కు సందేశాల ను పంపుతున్నారు. లేదంటే సిలిండర్‌ పొందేందు కు ఇబ్బందులు తప్పడం లేదు.

●అన్నదాత సుఖీభవ పథకాలతో పాటు రైతులు ఎరువులు పొందాలన్నా ఈకేవైసీ కావాల్సిందేనన్న ప్రభుత్వ ఆదేశాలతో సచివాలయాలు, బ్యాంకుల కు పరుగులు తీస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్ని ల్స్‌, నెట్‌వర్క్‌ సమస్యతో ఈకేవైసీకి గంటల సమ యం పడుతోంది. విసిగిపోయి ఈకేవైసీ చేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాకు జమకావడంలేదంటూ పలువురు రైతులు వాపోతున్నారు.

●జిల్లాలోని 1584 పాఠశాలల్లో చదువుతున్న లక్షా 18 వేల మంది పిల్లలు తల్లికి వందనం పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరి సమగ్ర సమాచారం యూడైస్‌లో పొందుపర్చారు. గతేడాది జిల్లా పరిధి లో లక్షా 8,951 మంది అర్హులని చెప్పిన యంత్రాంగం శతశాతం తల్లుల ఖాతాలకు లబ్ధి జమ చేయలేదు. అప్పట్లో అనేక కారణాలు చూపి అర్హత ఉన్న మెండిచేయి చూపారు. ఇందులో ఈకేవైసీ కూడా ఓ కారణంగా చెప్పారు. మరోవైపు జిల్లాలోని చాలా మంది పిల్లల తల్లి పేరు ‘కిల్లో స్వప్న’ అని నమోదైంది. ఆమె ఐటీ రిటర్స్‌ చెల్లించినట్టు ఆన్‌లైన్‌లో చూపించడంతో పథకానికి అనర్హురాలిగా ప్రకటించారు. ఆమె పేరు తల్లిగా నమోదైన పేదపిల్లలకు కూడా పథకానికి దూరమయ్యారు. పేరు సరిచేసి పథకం లబ్ధి అందించాలని ఏడాదిపాటు విద్యార్థు ల తల్లులు సచివాలయాలు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఆ భయంతో ఇప్పుడు పిల్లల తల్లులు బ్యాంకుల వద్ద తమ వివరాలను ఈకేవైసీ చేయిస్తున్నారు. పొరపాటున ఒక్క సారి పథకం లబ్ధి ఆగిపోతే సరిచేసే పరిస్థితి ప్రస్తుత సర్కారులో ఉండదని బెంగపడుతున్నారు.

కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకం పొందడం ఓ ప్రహసనంగా మారింది. అర్హత ఉన్నా లబ్ధి సమకూరడం లేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలు తీరు అంతంతమాత్రమే. సూపర్‌ సిక్స్‌లో అమలయ్యే కొద్దోగొప్పో పథకాల్లో నేటికీ స్పష్టత లేదు. ప్రతి విషయంలో నిబంధనలతో పాటు సాంకేతిక మెలిక ఉండడంతో అర్హులు అవస్థలు పడుతున్నారు. అర్హత ఉన్నా లబ్ధి సమకూరపోతే ఎలా అనే అంశంలో సర్కారు నుంచి జవాబుదారీతనం లేదు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో అర్హతే ప్రామాణికం. వలంటీర్ల వ్యవస్థ, సచివాలయ యంత్రాంగం పూర్తి సమన్వయంతో అర్హుల ఇళ్లకే సంక్షేం అందించేది. మధ్యవర్తులు లేకుండా డీబీటీ విధానంలో వ్యక్తిగత ఖాతాలకు నగదు జమయ్యేదన్నది ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.

– విశ్వాసరాయి కళావతి, మాజీ శాసన సభ్యురాలు, పాలకొండ నియోజకవర్గం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement