నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు దళారీ వ్యవస్థ నిర్మూలనకే డిజిటలైజేషన్‌ ● డీఆర్వో పార్వతి బీటీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత డొల్ల

సీతంపేట: మొహర్రం సందర్భంగా సీతంపేట ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేసినట్టు పాలకొండ సబ్‌ కలెక్ట ర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్‌ స్వప్నిల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయం గమనించాలని కోరారు.

పాలకొండ రూరల్‌: రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు డిజిటలైజేషన్‌ ప్రక్రియను అమలు చేస్తున్నట్టు జిల్లా రిజిస్ట్రార్‌ ఎం.పార్వతి అన్నారు. పాలకొండ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించా రు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఏపీ ఐజీఆర్‌ఎస్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను నేరుగా చేసుకోవచ్చన్నారు. సంబంధిత డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. వ్యక్తులు రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకొని అనంతరం ఈ ప్రక్రియను కొనసాగించాలన్నా రు. ఈ నూతన విధానం ద్వారా ఆస్తి లావాదేవీల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రజలకు నగదుతో పాటు సమయం కూడా వృథా కాదని స్పష్టం చేశారు.

సాలూరు రూరల్‌: మండలంలో ఇటీవల చేపట్టిన బీటీ రోడ్లు పనుల్లో నాణ్యత లోపించింది. చిన్నపాటి వర్షానికే రోడ్లు కోతకు గురవుతున్నా యి. బీటలు వారుతున్నాయి. కూర్మరాజు పేట గ్రామం మీదుగా పునికినవలసకు నిర్మించిన రోడ్డు మూన్నాళ్లముచ్చటగా మారింది. మామిడిపల్లి రోడ్డు నుంచి ప్రారంభమైన పనుల్లో నాణ్యత లోపించింది. కూర్మరాజుపేట దాటిన తరువాత మెట్ట వద్ద రోడ్డు మధ్యలో బీటలు వారాయి. ఇదేం రోడ్డు నిర్మాణమంటూ అధికా ర పార్టీకి చెందిన నాయకుడిని గ్రామస్తులు, యువకులు నిలదీస్తున్నారు. నాసిరకం రోడ్లతో ప్రజాధనం లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఏసీబీ వలలో ఎం.కొత్తవలస వీఆర్వో

జామి/విజయనగరం క్రైమ్‌: జామి మండలం ఎం.కొత్తవలస వీఆర్వో కొత్తలి వీరన్న ఏసీబీ వలకు గురువారం చిక్కారు. భూమి మ్యుటేషన్‌ కోసం సునీత అనే మహిళా రైతు నుంచి రూ.14వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమో దు చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన జంకల సూర్యనారాయణ, సునీత దంపతులకు 21 సెంట్లు భూమి వారసత్వంగా వచ్చింది. రీ సర్వేలో 22 సెంట్ల 30 లింకులు నమోదైంది. సెంటు 30 లింకులను ఆన్‌లైన్‌లో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసేందుకు వీఆర్వో రూ.25వేలు లంచం డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేమని రైతు దంపతు లు ప్రాథేయపడడంతో రూ.18000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.4వేలు తీసుకున్నారు. మిగిలిన సొమ్ము ఇచ్చుకోలేని రైతు కుంటుంబం ఏసీబీని ఆశ్రయించింది. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని మహిళా రైతు సునీత నుంచి వీఆర్వో వీరన్న డబ్బులు తీసుకుని లెక్కపెడుతుండగా పట్టుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement