శోభాయమానంగా.. శిఖర ప్రతిష్ఠ | - | Sakshi
Sakshi News home page

శోభాయమానంగా.. శిఖర ప్రతిష్ఠ

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

విజయనగరం టౌన్‌: సిరుల తల్లి సాక్షాత్కరించింది. అమ్మవారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. జై పైడిమాంబ నినాదాలతో చదురుగుడి ప్రాంతమంతా భక్తిభావం నెలకొంది. శిఖరప్రతి ష్ఠ మహోత్సవంలో ఆలయ అనువంశిక ధర్మక ర్త, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు కుటుంబసభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచల దేవస్ధానం ఆగమ పాఠశాల శైవాగమ పండితులు కాళ్లకూరి సుబ్ర హ్మణ్యశర్మ నేతృత్వంలో వేదపండితులు వేదమంత్రోచ్చారణలతో సంప్రదాయరీతిలో క్రతు వు పూర్తిచేశారు. అనంతరం సాధారణ భక్తులకు మధ్యాహ్నం నుంచి అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా గోవా గవర్నర్‌ అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ అమ్మవారి ఆశీ స్సులు ప్రజలందరిపైనా ఉండాలని ఆకాంక్షించా రు. విస్తరణ పనులు విజయవంతంగా పూర్తిచేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేవలం ఆరు నెల ల వ్యవధిలోనే ఆలయ విస్తరణ పనులు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ అమ్మవారి ఆలయ పునఃప్రారంభ మహోత్సవాల్లో పాల్గొనడం తన పూర్వజన్మసుకృతమన్నారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మీగజపతిరాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరిందన్నారు. ఆలయం వద్దనున్న ఖాళీస్థలంలో భక్తులకు అవసరమైన వసతులను కల్పించనున్నామని చెప్పారు. కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఆలయ ఈఓ కె.శిరీష, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కనుల పండువగా మహోత్సవం

అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవం కనులపండుగగా జరిగింది. కలశాలకు పూసపాటి వంశీయులు పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు దర్శించుకున్నారు.

భక్తిశ్రద్ధలతో పైడితల్లి ఆలయ

పునఃప్రారంభం

తొలిపూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్న పూసపాటి వంశీయులు

మధ్యాహ్నం నుంచి సాధారణ

భక్తులకు దర్శనభాగ్యం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement