బీఎల్‌ఏలతో ప్రత్యేక సమావేశం రేపు | - | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఏలతో ప్రత్యేక సమావేశం రేపు

Jun 25 2026 1:18 AM | Updated on Jun 25 2026 1:18 AM

బీఎల్‌ఏలతో ప్రత్యేక సమావేశం రేపు

సాలూరు: నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏల(బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు)కు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మాజి డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ఎంపీపీలు, వైస్‌ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులంతా తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. పట్టణంలోని తన ఇంటి వద్ద గల వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించే సమావేశంలో బీఎల్‌ఏలకు ఐడీ కార్డులు అందించనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement