న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026
సచివాలయ ఉద్యోగులకు
● పెదపెంకిలో డిప్యూటీ సీఎం పర్యటన రద్దు
● లక్ష్యం ప్రకారం పూర్తికాని పనులు
జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి మాధురి
పార్వతీపురం: వచ్చేనెల 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి ఎం.మాధురి సూచించారు. జిల్లా పోలీస్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీచేయదగిన క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులను గుర్తించి లోక్ అదాలత్‌లో పరిష్కరించాలని సూచించారు. రాజీ వల్ల కక్షిదారులకు సమయం, ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు. వారెంట్ పెండింగ్ కేసులు, గంజాయి, పోక్సో చట్టాలకు సంబంధించిన కేసుల్లో ముద్దాయిలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అడిషనల్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె.సౌమ్య జోస్పిన్, పోలీస్, ఎకై ్సజ్, రెవెన్యూశాఖల అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం రూరల్: ఈ నెల 30 నిర్వహించనున్న కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూ) ప్రథమ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌కు సీటీయూ ఉపకులపతి టి.శ్రీనివాసన్ ఆహ్వానించారు. విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ను మంగళవారం కలిసి ఆహ్వాపత్రికను అందజేశారు. వర్సిటీలో జరుగుతున్న విద్యా, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు గవర్నర్ సుముఖత తెలిపినట్టు వీసీ ఓ ప్రకటనలో తెలిపారు.
అంతర్జాతీయ చెస్ పోటీల్లో జ్వాలాముఖి ప్రతిభ
విజయనగరం: అంతర్జాతీయ స్థాయిలో జరిగిన చెస్ పోటీల్లో విజయనగరానికి చెందిన కేవీ.జ్వాలాముఖి తన ప్రతిభతో సత్తా చాటాడు. హైదరాబాద్‌లోని సరోవర్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన డేనిస్ ఇంటర్నేషనల్ ఫీడ్ రేటెడ్ చెస్ టోర్నమెంట్‌లో పీహెచ్‌సీ విభాగంలో ప్రాతినిధ్యం వహించిన జ్వాలాముఖి ద్వితీయ బహుమతి సాధించి రూ.6000 నగదుతో పాటు ట్రోఫీని కూడా గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో అమెరికా, స్వీడన్, జపాన్‌న్, భారతదేశం నుంచి 680 మంది క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ చెస్ పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానం దక్కించుకున్న జ్వాలాముఖిని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేకే.జగన్నాధ, కార్యదర్శి ప్రసాద్‌తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు, సీనియర్ చెస్ క్రీడాకారులు అభినందించారు.
పార్వతీపురం రూరల్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఓ వైపు యాప్‌ల భారం.. మరోవైపు సర్వేలతో సతమతం అవుతుండగా, ఇంకోవైపు ఉద్యోగేతర విధులు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, తాజాగా చేపట్టిన ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ ఆందోళనకు గురిచేస్తోంది. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీలు చదివి పోటీపరీక్షలో ఉద్యోగాలు సాధించినా ప్రస్తుత ప్రభుత్వం తీరుతో విలువలేకుండా పోతోందని మనోవేదనచెందుతున్నారు. సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పనిభారం, వేధింపులు తట్టుకోలేక ఇప్పటికే చాలామంది ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా పాలకుల్లో కదలిక లేకపోవడం ఉద్యోగులను ఆవేదనకు గురిచేస్తోంది. పైగా, మిగులు సిబ్బంది కుదింపు పేరిట చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఏకపక్ష నిర్ణయాలు, బలవంతపు పోస్టింగులు సచివాలయ ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. నిబంధనలను పూర్తిగా గాలికొదిలేసి, ఉద్యోగుల ఇష్టాయిష్టాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా సాగిస్తున్న ఈ ప్రహసనంపై ఉద్యోగవర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
దాదాపు ఐదు శాఖలకు బదిలీలు
సచివాలయాల్లో సిబ్బందిని తగ్గించి, ఇతర శాఖలకు సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. చైల్డ్ వెల్ఫేర్, మెప్మా, హోంశాఖ, బీసీ వెల్ఫేర్, సెర్ప్ తదితర దాదాపు ఐదు శాఖలను ఎంపిక చేసి రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సచివాలయ ఉద్యోగులను ఆయా విభాగాలకు పంపేందుకు రంగం సిద్ధం చేసింది. వాస్తవానికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని వేరే శాఖకు పంపేటప్పుడు ఆయా శాఖల ’జాబ్ చార్ట్’ ముందుగా ఇచ్చి, వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం కనీస నిబంధనలు పాటించడం లేదు. అసలు ఎవరు ఏ శాఖకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారో అడగకుండా, కేవలం రెండు వేల లోపు జనాభా ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని, అక్కడున్న వీఆర్వోలు, డిజిటల్ అసిస్టెంట్లు, మహిళా సంరక్షణ పోలీసులను ఇతర శాఖల్లోకి నెట్టేస్తోంది. సర్దుబాటు పేరిట చేసిన మార్పుల వల్ల ఉద్యోగులు ఒకచోట విధులు నిర్వహిస్తుంటే, వారి జీతాల డ్రాయింగ్స్ మాత్రం మరో విభాగం, ప్రాంతం నుంచి జరుగుతుండడం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది.
రిలీవ్ కావాల్సిందే...
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 104 మంది సచివాలయ మహిళా సంరక్షణ పోలీసులను ఇతర విభాగాల్లోకి వేసేందుకు రంగం సిద్ధమైంది. విజయనగరంలో 62 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 42 మందిని ఈ నెల 25న రిలీవ్ చేయాలని, అదే రోజు ఎస్పీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలన్న మౌఖిక ఆదేశాలు అందాయి. వీరికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారన్నది స్పష్టత లేదు. దీంతో మహిళా సంరక్షణ పోలీసులు ఆందోళన చెందుతున్నారు.
ప్రహసనంగా సెలవు మంజూరు ప్రక్రియ
సచివాలయ ఉద్యోగుల సెలవుల మంజూరు ప్రక్రియ ప్రహసనంగా మారింది. అత్యవసరంగా ఒక రోజు సెలవు కావాలన్నా ముగ్గురు నుంచి నలుగురు అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించింది. సచివాలయ సిబ్బంది తమ విభాగాల పరంగా ముందుగా పంచాయతీ కార్యదర్శిని, ఆపై ఎంపీడీఓను, చివరకు సర్కిల్ సీఐ వంటి ఉన్నతాధికారులను సంప్రదించాల్సి వస్తోంది. ఇంతమంది చుట్టూ తిరిగి అనుమతులు కోరినా చివరకు సెలవు మంజూరు అవుతుందో లేదో తెలియని దయనీయ స్థితి. ఈ నిబంధనల వలయం ఉద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. బలవంతపు సర్దుబాట్లు కేవలం సచివాలయ ఉద్యోగులనే కాకుండా, వారు బదిలీ అయి వెళ్తున్న చైల్డ్ వెల్ఫేర్, మెప్మా, హోం శాఖల వంటి ఐదు విభాగాల్లోని పాత ఉద్యోగులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ప్రభుత్వం కనీస మార్గదర్శకాలు, స్పష్టమైన ’జాబ్ చార్ట్’ లేకుండా సచివాలయ సిబ్బందిని ఇతర శాఖల్లోకి బలవంతంగా సర్దుబాటు చేయడం మాలో తీవ్ర అభద్రతా భావాన్ని నింపుతోంది. మా ఇష్టాయిష్టాలతో (ఆప్షన్లు) ఏమాత్రం సంబంధం లేకుండా చేస్తున్న ఈ బదిలీల వల్ల పనిభారం పెరిగి సిబ్బంది మానసిక క్షోభకు, ఆత్మహత్యలకు బలవుతున్నారు. అటు సెలవులు దొరక్క, ఇటు సర్వీస్ రూల్స్‌పై స్పష్టత లేక బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ ఏకపక్ష నిర్ణయాలను ఆపాలి. సిబ్బందికి పూర్తి ఉద్యోగ భద్రత కల్పిస్తూ, కేవలం వారి విల్లింగ్ ఆధారంగానే పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించాలి.
– మహేష్ నాయుడు,
రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల
ఐక్య కార్యాచరణ కార్యదర్శి
ఇష్టారాజ్యంగా సర్దుబాటు ప్రక్రియ..
ఆప్షన్లు లేవు, విల్లింగ్‌తో పనేలేదు!
మహిళా సిబ్బంది నెత్తిన బలవంతంగా హోంశాఖ భారం
దిక్కుతోచని స్థితిలో సిబ్బంది
జిల్లా వ్యాప్తంగా 350 సచివాలయాల్లో 2,976 మంది ఉద్యోగులు


