మలేరియాతో గిరిజన యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

మలేరియాతో గిరిజన యువకుడి మృతి

Jun 24 2026 1:11 AM | Updated on Jun 24 2026 1:11 AM

సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని నౌగూడ గ్రామానికి చెందిన సవర పూర్ణచంద్ర అనే గిరిజన యువకుడు మలేరియా, పచ్చకామెర్ల లక్షణాలతో బాధపడుతూ మృతిచెందినట్టు తల్లిదండ్రులు సవర గంగమ్మి, రాజేష్‌ తెలిపారు. తీవ్రమైన చలి, జ్వరంతో బాధపడుతుండడంతో ఈ నెల 17న సీతంపేట ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యసేవల కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పదోతరగతి వరకు చదివిన పూర్ణచంద్ర కొండపోడు పనుల్లో చేదోడువాదోడుగా ఉండేవాడు. అకస్మాతుగా మృతిచెండంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గిరిజన విద్యార్థి మృతి

సీతంపేట మండలంలోని జొనగ బుడ్డడుగూడ గ్రామానికి చెందిన సవర దివాకర్‌ (9) అనే గిరిజన విద్యార్థి మలేరియాతో బాధపడుతూ శ్రీకాకుళం రిమ్స్‌లో మంగళవారం మృతిచెందాడు. సరిహద్దుగూడ గ్రామానికి చెందిన సవర లాజర్‌, మేరీల చిన్నకుమారుడు దివాకర్‌కు ఈనెల 16న జ్వరం రావడంతో పాలకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. జ్వరం తగ్గకపోవడంతో ఈనెల 18న పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అప్పటికే పరిస్థితి విషమించడంతో రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు మల్లి ఏపీఆర్‌ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల ప్రిన్సిపాల్‌ వాసుదేవరావుతో పాటు సిబ్బంది మృతుని ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.15 వేలు అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement