పార్వతీపురం రూరల్: డీఎస్సీ–2025కు సంబంధించి మెరిట్ జాబితా, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు విడుదల చేయాలని కోరు తూ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. గతంలో నిర్వహించిన డీఎస్సీల తరహాలోనే ప్రస్తుత నియామక ప్రక్రియలో కూడా మెరిట్, కటాఫ్ వివరాలను బహిర్గతం చేసి అభ్యర్థులకు స్పష్టతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిని రాష్ట్ర ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను కోరారు.
గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం వైటీసీ కేంద్రంలో సోమవారం హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ప్రసవానికి వచ్చిన ఇద్దరు గర్భిణులను ఇక్కడి వసతి గృహంలో చేర్చుకోమంటూ సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న వారు.. ఎందుకు చేర్చుకోరని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని బీరుపాడు పంచాయతీ పరిధి వాడజంగి గ్రామానికి చెందిన పువ్వల గంగోత్రి, కిల్లక మహంతిలు ఎనిమిది నెలల గర్భి ణులు. వారిని పరీక్షించిన దుడ్డుఖల్లు పీహెచ్‌సీ వైద్యులు.. మెరుగైన వైద్యం, పౌష్టికాహారం కోసం గుమ్మలక్ష్మీపురం వైటీసీలో చేరాలని సూచించారు. సోమవారం ఇక్కడికి వచ్చిన వారిని ఉన్నతాధికారుల సూచనల మేరకు వస తి గృహం సిబ్బంది చేర్చుకునేందుకు ససేమి రా అన్నారు. వారితో వాగ్వాదానికి దిగిన గర్భిణులు... తమ ఊరు గిరిశిఖరాన ఉందని, తిరి గి వెళ్లేందుకు రోడ్డు సదుపాయం లేదని, ఇళ్లకు చేరేలోపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గతంలో వసతి గృహంలో చేరాలంటూ ఊరూరా వచ్చి అవగాహన కల్పించేవారని, ఇప్పుడు చేర్చుకునేది లేదంటూ చెప్పడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఇదెక్కడి అన్యాయమంటూ వాపోయారు. వైటీసీలో చేర్చుకోవాలని గట్టిగా నిలదీయడంతో సిబ్బంది వారిని చేర్చుకున్నారు.


