● కదం తొక్కిన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

● కదం తొక్కిన విద్యార్థులు

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సాలూరులో సోమవారం ఆందోళన చేశారు. మానవహారం నిర్వహించి ప్రభుత్వం అలసత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవికుమార్‌ మాట్లాడుతూ రూ.6,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రూ.2,200 కోట్ల స్కాలర్‌షిప్‌ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. రూ.10,700 కోట్లకు 2026–27 బడ్జెట్‌లో కేవలం రూ. 2,766 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. గతంలో వసతిదీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, డిగ్రీ విద్యార్థులకు రూ.20వేలు చొప్పున అందేవన్నారు. బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు, సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేదకుటుంబాల

విద్యార్థుల చదువులు ముందుకు సాగడంలేదని వాపోయారు. – సాలూరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement