కాపుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు | - | Sakshi
Sakshi News home page

కాపుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

రేగిడి: రాష్ట్రంలో కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు బకాయిపెట్టిన రూ.9వేల కోట్లు నిధులు విడుదలచేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం రేగిడి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో కాపునేస్తం సహా ఎన్నో పథకాలను కాపులకు అందించారని గుర్తు చేశారు. ఇళ్ల స్థలాలు, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, కాపునేస్తం వంటి పథకాలు కాపు మహిళలు, విద్యార్థులకు అందజేశారన్నారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే కాపులు గుర్తుకు వస్తారని, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత కాపులను విస్మరించడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. కాపు కులంలో ఉన్నవారంతా రౌడీలా!, అధికార పార్టీనేతల అరాచకాలు చంద్రబాబు కళ్లకు కనిపించడంలేదన్నారు. తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్‌ వావిలపల్లి జగన్మోహనరావు, కింజరాపు సురేష్‌, కరణం శ్రీనివాసరావు, కెంబూరు వెంకటేశ్వరరావు, ఎర్నేన అప్పలనాయుడు, బాలి తవిటినాయుడు, బెవర అనంతనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement