సీతానగరం: మండలంలోని సూరంపేట కేంద్రంగా మామిడి తో టల్లో 8 ఏనుగులు సంచరిస్తున్నాయి. పగటి పూటంతా మామిడి తోటల్లో స్థావరం ఉంటూ సాయంత్రం తాన్న సీతారాంపుం గ్రామ శివారులో ఉన్న చెరువులో నీరుతాగి బీటీరోడ్డు మీదుగా ఏర్పర్చుకున్న స్థావరానికి తరలిపోతున్నాయి. జీడిమామిడి తోటల్లో కొమ్మలు విరగ్గొట్టడం, మామిడి కాయలు రాల్చడంతో రైతులు, తోటకాపరులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 8 గజరాజులను చూసేందుకు ప్రజలు తరలివస్తున్న సమయంలో అటవీశాఖ అధికారులు, సిబ్బందితో వచ్చి వాటి దగ్గరకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు. ఐదురోజులుగా స్థానికంగా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం జరకుండా అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలతో జాగ్రత్తలు చెబుతున్నారు. గుచ్చిమి, సీతారాంపురం,చిన్నారాయుడుపేట, రేపటివలస గ్రామాల ప్రజలు రాకపోకల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.


