సీతానగరం: మండలంలోని సూరంపేట మామిడి తోటలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. గత నాలు గు రోజులుగా ఇదే పరిసర ప్రాంతాల్లో గజరాజులు తిరుగుతుండడం స్థానికులు బెంబేలెత్తుతున్నారు. పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి ప్రాంతం నుంచి సూరంపేటకు చేరుకున్న ఏనుగులు..సీతారాంపురం, గుచ్చిమి, మరిపివలస ప్రాంతాల పొలాల్లో తిరుగుతున్నాయి. ఆదివారం ఉదయం సూరంపేట కాలువ గట్టు ఆనుకుని ఉన్న ఓ మామి డి తోటలో ఏనుగుల గుంపు తిరుగుతూ కనిపించ గా అవి ఎక్కడ మామిడి కాయలు తినేస్తాయోనని తోటల యజమానులు, కాపలాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి నష్టం జరగకముందే వాటిని ఇక్కడి నుంచి తరిమేయాలని కోరుతున్నారు. ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు.


