కురుపాం: మండల కేంద్రంలోని రావాడ కూడలిలో ఉన్న ఒక ప్లాస్టిక్ దుకాణంలో ఆదివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో దుకాణంలో ఉన్న ప్లాస్టిక్ సామగ్రి, వ్యవసాయ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమయానికి అగ్నిమాపక వాహనం రాక పోవడంతో పక్కనున్న షాపులకు సైతం మంటలు వ్యాపించే క్రమంలో ఎస్సై పి.నారాయణరావు చొరవతో స్థానికులు వాటర్ ప్యాకెట్స్ విసిరి మంటలను అదుపులోకి తేవడంతో ఇతర షాపులకు మంటలు వ్యాపించలేదు. కానీ ప్లాస్టిక్ దుకాణం యజమాని కందుల విశేశ్వరరావుకు ఈ ప్రమాదంలో దుకాణం పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు రూ.ఐదు లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.
సుమారు రూ.ఐదు లక్షల నష్టం


