నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం

పార్వతీపురం: అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవాన్ని ఆదివారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జరిగే వేడుకకు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జీవనం సొంతమవుతుందని పేర్కొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

పాలకొండ రూరల్‌: సీ్త్ర శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ సేవలు అందించేందుకు అవసరమైన బస్సులు లేవు... కాలం చెల్లిన టిమ్‌ పరికరాలతో నరకం చూస్తున్నాం అంటూ ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు పాలకొండ డిపో వద్ద శనివారం ఆందోళన చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నూతన టిమ్‌ యంత్రాలు మంజూరు చేయాలని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని నినదించారు. కార్యక్రమంలో ఎన్‌ఎంయూ నాయకులు వి.కె.రావు, పి.ఎల్‌.రావు, ఎస్టీ రావు, బీఎస్‌ రావు, డీజీ రావు, ఎం.ఆర్‌.మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీలకు

స్టవ్‌ల పంపిణీ

పార్వతీపురం: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణలో భాగంగా కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ టి.కనకదుర్గతో కలిసి అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్‌ స్టవ్‌లను పంపిణీ చేశారు. పిల్లలు, గర్భిణులకు సురక్షితంగా, త్వరితగతిన పౌష్టికాహరం తయారు చేయడానికి ఈ స్టవ్‌లు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్టవ్‌ల పంపిణీపై కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌’ తొలి విడత నిధులను కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి విడుదల చేశారు. జిల్లాలో 1,22,260 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.61.13 కోట్లు, 1,09,511మంది రైతులకు పీఎం కిసాన్‌ కింద రూ.21.90కోట్లు రైతుల ఖాతాలలో జమ కానున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement