శరత్‌బాబు కుటుంబానికి ఆర్థిక అండ | - | Sakshi
Sakshi News home page

శరత్‌బాబు కుటుంబానికి ఆర్థిక అండ

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

కొమరాడ: ఇటీవల గుండెపోటుతో వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నంగిరెడ్డి శరత్‌బాబు అకాల మరణం పార్టీతో పాటు వ్యక్తిగతంగా తమకు తీరని లోటని పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. రాజ్యలక్ష్మీపురం గ్రామానికి చెందిన శరత్‌బాబు కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇటీవల ఫోన్‌లో పరామర్శించారు. అనంతరం అండగా ఉంటామని ప్రకటించారు.

ఈ మేరకు రూ. 3లక్షల చెక్కును పరీక్షిత్‌రాజు, పుష్పశ్రీవాణి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులకు జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ ద్వారపురెడ్డి జనార్దనరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కళింగ మల్లేశ్వరరావు, మరడాన సూరపు నాయుడు, మరడాన సింహాచలంనాయడు, మాజీ సర్పంచ్‌ కెంగువ పోలినాయుడు, ఏగిరెడ్డి సింహాచలం, కొల్లి సింహాచలం, పలువురు వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు.

శరత్‌బాబు మరణం తీరని లోటు

కుటుంబానికి అండగా జగనన్న ఆర్థిక సాయం

రూ.3 లక్షలు అందజేసిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement