యోగాంధ్ర పోటీల్లో మన్యం ఫస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

యోగాంధ్ర పోటీల్లో మన్యం ఫస్ట్‌

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

వీరఘట్టం: యోగాంధ్ర పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం లభించింది. జిల్లా నుంచి ప్రజెంట్‌ చేసిన యోగాంధ్ర స్మార్ట్‌ ఫిల్మ్‌ అందరినీ ఆలోచింపజేసిందని జిల్లా యోగాంధ్ర అసిస్టెంట్‌ కో–ఆర్డినేటర్‌ కె.జనార్దనరావు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు వ్యసనాలకు బానిసలై జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో తెలియజేస్తూ.. వారి జీవితాలను యోగా ఏవిధంగా ప్రభావితం చేసిందన్న విషయంపై జల్లు విశ్వేశ్వరరావు రూపొందించిన షార్ట్‌ ఫిల్మ్‌ జిల్లా నుంచి ప్రదర్శించినట్లు వివరించారు. ఇది న్యాయనిర్ణేతలను ఆకట్టుకుందన్నారు. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చేతుల మీదుగా అవార్డు అందజేశారని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement