సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తథ్యం | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తథ్యం

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

ఆర్టీసీ ఎన్‌ఎంయూ జిల్లా కార్యదర్శి రాఫెల్‌ హెచ్చరిక

విజయనగరం అర్బన్‌: ఆర్టీసీ జోన్‌ పరిధిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ ఎన్‌ఎంయూ జిల్లా కార్యదర్శి పీజీ రాఫెల్‌ హెచ్చరించారు. స్థానిక డిపో ఎదుట శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆర్టీసీలో ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు. జోనల్‌ మేనేజర్‌కు పలుమార్లు మెమోరాండంలు ఇచ్చినప్పటికీ కేంద్ర కార్యాలయం సర్క్యులర్లను పాటించకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లతో కూడిన 18 అంశాల మెమోరాండంను ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌కు అందజేసినట్లు తెలిపారు. డిమాండ్లలో ‘సీ్త్ర శక్తి’ పథకం అమలు ద్వారా ఎదురైన సమస్యలు, సిక్‌ లీవ్స్‌ జీతాల చెల్లింపులు, సర్క్యులర్ల అమలు, డ్రైవర్ల వేధింపుల నిలిపివేత, ఏకపక్ష చర్యల నిరసన, కొత్త టిమ్స్‌, ఖాళీల భర్తీ అండ్‌ ప్రమోషన్ల భర్తీ వంటివి ఉన్నాయి. జోనల్‌ కమిటీ సభ్యులు బి.రామారావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో డిపో నాయకులు యు.సంజీవరావు, కె.బంగార్రాజు, వి.అప్పలరాజు, శకుంతల, భారతి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement