భామిని: భామిని తహసీల్దార్ శివన్నారాయణపై భామిని మండల గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)లు బుధవారం సబ్‌కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వీఆర్‌ఏలతో తహసీల్దార్ వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, సమయపాలన లేకుండా అర్ధరాత్రి వరకు విధుల పేరున వేధిస్తున్నారని ఆరోపించారు. తహసీల్దార్ తాత్కాలికంగా ఉంటున్న బత్తిలి ఇంటిలోనూ, సీతా నగరం మండలం మరిపువలస గ్రామంలోని సొంత ఇంటి వద్ద వీఆర్‌ఏలతో వెట్టిచాకిరీ పనులు చేయిస్తున్నారని వాపోయారు. కులంపేరుతో దూషిస్తూ, తహసీల్దార్ కార్యాలయం వద్ద సిమెంట్ కట్టు పను లు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంత రం పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు కూడా ఫిర్యాదు చేసినట్టు వీఆర్‌ఏల సంఘం జిల్లా కార్యదర్శి బుడుమూరు మిన్నారావు, మండలాధ్య క్షుడు నిమ్మల కర్ణ తెలిపారు. కార్యక్రమంలో 16 మంది వీఆర్‌ఏలు పాల్గొన్నారు.


