కాసులతోనే... కు.ని. ఆపరేషన్‌..! | - | Sakshi
Sakshi News home page

కాసులతోనే... కు.ని. ఆపరేషన్‌..!

Mar 19 2026 8:26 AM | Updated on Mar 19 2026 8:26 AM

కాసులతోనే... కు.ని. ఆపరేషన్‌..!

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో అనేక మంది మహిళలు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం రూ.వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ సర్కార్‌ హయాంలో ఈ ఆపరేషన్లకు సొంత డబ్బులు పెట్టుకోవాల్సి రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణలో ప్రధానమైన కుటుంబ నియంత్రణ పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అనేక ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నా.. ప్రైవేటులో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడం పట్ల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 48 పీహెచ్‌సీలు

జిల్లాలో 48 పీహెచ్‌సీలు ఉన్నాయి. బాడంగి, బొబ్బిలి, భోగాపురం, నెల్లిమర్ల సీహెచ్‌సీలు ఉన్నాయి. ఎస్‌.కోట, చీపురుపల్లి, రాజాం, గజపతినగరం ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఘోషాస్పత్రి, పట్టణంలో కుటుంబ సంక్షేమ కేంద్రం, బొబ్బిలిలో కుటుంబ సంక్షేమ కేంద్రం ఉన్నాయి. వీటిల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయడానికి పీహెచ్‌సీ వైద్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. అయినప్పటకీ వీటిల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి వెళ్లిన వారికి ఏదో ఒక కుంటి సాకులు చెప్పి చేయకుండా పంపించేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.20 వేల వరకు

వసూలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయకపోవడం వల్ల మహిళలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ మహిళలు నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేలు వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగోలేని మహిళలు ఒకరు, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. కొంతమంది ఒక పిల్లతో శస్త్రచికిత్స చేయించుకోగా, మరికొందరు ఇద్దరు పిల్లలతో చేయించుకుంటున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయని వైనం!

ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న

మహిళలు

ఉచితంగా జరగాల్సిన వాటికి డబ్బులు చెల్లింపు

మెంటాడ మండలానికి చెందిన కె.కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడ ఆమెకు ఈ శస్త్రచికిత్స చేసేందుకు సదరు ఆస్పత్రి వారు రూ.10వేలు తీసుకున్నారు.

ఉచితంగా చేయాలి..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలి. ఎక్కడైనా చేయకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి,

డీఎంహెచ్‌ఓ, విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement