మహమ్మారిపై టీకాస్త్రం | - | Sakshi
Sakshi News home page

మహమ్మారిపై టీకాస్త్రం

Mar 10 2026 12:54 PM | Updated on Mar 10 2026 12:54 PM

మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026 మహమ్మారిపై టీకాస్త్రం మూడు నెలల్లో లక్ష్యం మేరకు టీకాలు

న్యూస్‌రీల్‌

జిల్లాలో 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ టీకా 10వేల మందికి పంపిణీ లక్ష్యం చాపకింద నీరులా కేన్సర్‌ కేసులు వ్యాధిని అరికట్టేందుకు ఉచితంగా వ్యాక్సిన్‌ అందజేస్తున్న కేంద్రం

మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026

అర్హులైన బాలికలందరూ తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వచ్చి, వారి అంగీకారంతో టీకా వేయించుకోవాలి. ఈ అవకాశాన్ని ప్రతిఒక్క రూ సద్వినియోగం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలువుతున్న ఈ కార్యక్ర మాన్ని జిల్లాలో కూడా అధికారులు పకడ్బందీ గా నిర్వహించాలి. రాబోయే మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.

– డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి, కలెక్టర్‌

సాక్షి, పార్వతీపురం మన్యం:

కేన్సర్‌.. ప్రాణాంతకమైన రోగం. మన జీవన శైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే.. నివారణ సులువే! ఆలస్యమైతే ప్రాణాలనే తినేస్తుంది. పురుషుల కంటే.. మహిళలే ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

ముందే మందేసేద్దాం..

మహిళల్లో వచ్చే భయంకరమైన గర్భాశయ కేన్సర్‌ను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ టీకా పంపిణీ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా ఆస్పత్రిలో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి సోమవారం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో 14 ఏళ్లు నిండిన సుమారు 10 వేల మంది బాలికలు/యువతులను ఈ టీకా కోసం గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో డోస్‌ ధర రూ.4 వేలు పైనే. కేంద్ర ప్రభుత్వం ఈ టీకాలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. గర్భాశయ కేన్సర్‌ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి మహిళలకు దీర్ఘకాలిక రక్షణ కల్పించేందుకు ఈ టీకా ఎంతో దోహదపడుతుందని వైద్యులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement