ఆదాయ లక్ష్యాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఆదాయ లక్ష్యాలు సాధించాలి

Mar 10 2026 12:54 PM | Updated on Mar 10 2026 12:54 PM

విజయనగరం కలెక్టరేట్‌: ప్రభుత్వానికి వివిధ శాఖల నుంచి వస్తున్న ఆదాయాన్ని పెంచాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజిష్ట్రేషన్‌, రవాణా, గనులు భూగర్భఖనిజశాఖ, ఎకై ్సజ్‌, అటవీ, వాణిజ్య పన్నులు, తదితర ఆదాయ సము పార్జన శాఖల అధికారులతో తన చాంబర్‌లో సోమ వారం సమీక్షించారు. శాఖలవారీగా ఆదాయార్జన ప్రగతిపై సమీక్షించారు. కొన్నిశాఖల నుంచి ఆదా యం తగ్గడానికి కారణాలను ఆరాతీశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తప్పనిసరిగా లక్ష్యాలను అధిగమించాలని ఆదేశించారు.

సమావేశంలో నోడల్‌ ఆఫీసర్‌, జిల్లా రిజిస్ట్రార్‌ ఎస్‌.మోహనరావు, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ మణికుమార్‌, ఎఫ్‌ఆర్‌ఓ రాంనగేష్‌, ఎకై ్సజ్‌ కమిషనర్‌ బి.శ్రీనాథుడు, జీఎస్‌టీ జాయింట్‌ కమిషనర్‌ నిర్మలాజ్యోతి, గనులశాఖ డీడీ సూర్యచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement