17న ‘ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర’ | - | Sakshi
Sakshi News home page

17న ‘ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర’

Mar 10 2026 12:54 PM | Updated on Mar 10 2026 12:54 PM

17న ‘ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర’ పోలీస్‌ సిబ్బంది ‘చేయూత’ హమాలీల సమస్యలు పరిష్కరించండి వలసలు అరికట్టడమే లక్ష్యం

పార్వతీపురం రూరల్‌: ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిలరెడ్డి ఈ నెల 17న పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ‘ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర’లో భాగంగా కురుపాం నియోజకవర్గం డంగభద్రలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తిన మోహన్‌ తెలిపారు. యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ చొక్కాపువానివలస, లక్ష్మీ నారాయణ పురం, కొత్తపట్నం గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చి న కొత్త చట్టంలోని లోపాలను, వేతనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్టీ అధ్యక్షు రాలి దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు తీళ్ల గౌరీ శంక రరావు, నాయకులు మర్రాపు తిరుపతిరావు, మామిడి చంద్రకాంత్‌, బాలు, పట్ల సింగ్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

14న జాతీయ లోక్‌అదాలత్‌

విజయనగరం: జాతీయ లోక్‌అదాలత్‌ను ఈ నెల 14న విజయనగరం హనుమాన్‌ నగర్‌లోని ఎంఆర్‌ పీజీ కళాశాల హాస్టల్‌ ప్రాంగణంలో నిర్వహిస్తామని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్‌అదాలత్‌లో వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్‌ క్రిమినల్‌ కేసులు, ఎన్‌ఐ యాక్టు, ఎకై ్సజ్‌ కేసులు, కుటుంబ తగదాలు, కార్మిక సంబంధిత కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభయ్యే లోక్‌అదాలత్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విజయనగరం క్రైమ్‌: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గజపతినగరం కానిస్టేబుల్‌ టి.తిరుపతిరావు కుటుంబానికి పోలీస్‌ సిబ్బంది అండగా నిలిచారు. ‘చేయూత’ కింద సేకరించిన రూ.1,47,800లను చెక్కురూపంలో కానిస్టేబుల్‌ భార్య దమయంతికి అదనపు ఎస్పీ సౌమ్యలత తన కార్యాలయంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ వి.లలిత, అడహాక్‌ కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నెల్లిమర్ల: జిల్లాలోని విద్యుత్‌స్టోర్స్‌లో పనిచేస్తున్న హమాలీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిక్ట్‌ స్టోర్స్‌ హమాలీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) సభ్యులు ఏపీ ఈపీడీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇ.పృద్విరాజ్‌కు విన్నవించారు. యూనియన్‌ నాయకులు కెల్ల గోవిందరావు, ఎ.భాష తదితరులు విశాఖపట్నంలో సోమవారం ఎం.డిని కలిశారు. ఏపీ ఈపీడీసీఎల్‌ కంపెనీ పరిధిలోని ఐదు జిల్లాల జట్టు కార్మికుల లోడింగ్‌, అన్‌లోడింగ్‌ బిల్లులను త్వరితగతిన చెల్లించాలని, సోర్స్‌ సిబ్బందికి ఉద్యోగభద్రత కల్పించాలని, నెలవారీ వేతనాలు చెల్లించాలని కోరారు. ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లు 50 శాతం పెంచి, లోడింగ్‌, ఆన్‌ లోడింగ్‌ బిల్లులు త్వరితగతిన చెల్లించాలన్నారు.

విజయనగరం ఫోర్ట్‌: వీబీ–జీ రామ్‌జీ కింద పనులు కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో వలసలను అరికట్టడమే లక్ష్యమని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో వీబీ–జీరామ్‌జీ చట్టంపై రూపొందించిన అవగాహన వాల్‌ పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఏటా ప్రతి కుటుంబానికి 125 రోజుల ఉపాధిహామీ కల్పిస్తామన్నారు. పనిచేసిన 15 రోజుల్లోగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేతనం జమచేయాలని, పనికోరిన 15 రోజు ల్లో పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. కృత్రిమ మేధ(ఏఐ) యాప్‌లతో పనుల పర్యవేక్షణ చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement