పోలీస్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో టీచర్‌ పోస్టుల భర్తీ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో టీచర్‌ పోస్టుల భర్తీ

Jun 26 2025 6:17 AM | Updated on Jun 26 2025 6:17 AM

పోలీస్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో టీచర్‌ పోస్టుల భర్తీ

పోలీస్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో టీచర్‌ పోస్టుల భర్తీ

విజయనగరం క్రైమ్‌: జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీస్‌ వెల్ఫేర్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎస్పీ వకుల్‌ జిందల్‌ బుధవారం తెలిపారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు తమ విద్యార్హతలతో పాటు, కచ్చితంగా ఆంగ్లంలో విద్యాబోధన చేయగలిగిన సామర్థ్యం ఉండాలని స్పష్టం చేశారు. ఉద్యోగ ఖాళీలు, విద్యార్హత వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయ ఉద్యోగం 1:

డీఈడీ లేదా బీఈడీ విద్యార్హతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి

2వ తరగతి కోసం సింగిల్‌ మదర్‌ టీచర్‌ ఉద్యోగం 1

సింగిల్‌ మదర్‌ టీచర్‌గా పని చేసేందుకు డీఈడీ, లేదా బీఈడీ అర్హతతో పాటు అన్ని సబ్జెక్టులను బోధించగలగాలి

3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు సబ్జెక్టును బోధించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం ఖాళీ 1

డీఈడీ లేదా బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలి

6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం బోధించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం ఖాళీ 1

బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలి

కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగం ఖాళీ 1

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేసేందుకు బీఎస్సీ లేదా బీకాం లేదా ఇతర కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగిన డిగ్రీ లేదా సర్టిఫికెట్‌ కోర్సులను అర్హతగా కలిగి ఉండాలి.

తోటమాలి ఖాళీ 1

పాఠశాలలో తోటమాలిగా పని చేసేందుకు ఆసక్తి కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు

పైన తెలిపిన ఉద్యోగాలను భర్తీ కోసం ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీన ఉదయం 10గంటలకు విజయనగరం కంటోన్మెంట్‌ పోలీస్‌ క్వార్టర్స్‌ సమీపంలో గల పోలీస్‌ వెల్ఫేర్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూ, డెమో క్లాసులకు నేరుగా హాజరుకావచ్చని ఎస్పీ పేర్కొన్నారు. మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం స్కూల్‌ ఆఫీసు నంబర్లు 9441022874, 6305883484 లేదా రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ 9121109485, వెల్ఫేర్‌ ఆర్‌ఎస్సై 9121109484 నంబర్లను సంప్రదించ వచ్చని ఎస్పీ వకుల్‌ జిందల్‌ సూచించారు.

దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement