స్ఫూర్తిప్రదాత అంబేడ్కర్
–8లో
మృత్యుంజయుడు పింటూ
భామిని మండలం సింగిడి గ్రామానికి
చెందిన పింటూ ఏనుగుల నుంచి తప్పించుకోవడంతో అందరూ పిరిపీల్చుకున్నారు.
పార్వతీపురంటౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనందరికీ స్ఫూర్తిప్రదాతని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రశాద్ అన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ జీవిత చరిత్రపై సమాచార పౌర సంబంధాలశాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తాత్విక చింతన దేశాన్ని నడిపిస్తుందన్నారు. దేశం ఏకతాటిపై నడుస్తుందంటే కారణం అంబేడ్కర్ దూరదృష్టేనన్నారు. జిల్లాలో ఎస్టీ, ఎస్సీ జనాభా ఎక్కువగా ఉందని, అంబేడ్కర్ స్ఫూర్తితో విజయాల దిశగా సాగాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.11.53 కోట్లతో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో హేమలత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సామల సింహాచలం, జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి ఎస్.మన్మథరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి కె.రాబర్ట్‌పాల్, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎం.డి.గయాజుద్దీన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యావంతుడు అంబేడ్కర్
పార్వతీపురం రూరల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఉన్నత విద్యావంతుడు, రాజనీతిజ్ఞుడని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి జిల్లా పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ దేశ ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో వసుదైక కుటుంబంలా కులమతబేధాలకు అతీతంగా జీవించాలనే దృఢసంకల్పంతో రాజ్యాంగాన్ని రచించారన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆదాం, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఏఆర్ ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, ఆర్‌ఎస్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
స్ఫూర్తిప్రదాత అంబేడ్కర్


