పెన్సిల్‌ మొనపై క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ | Sakshi
Sakshi News home page

పెన్సిల్‌ మొనపై క్రికెట్‌ వరల్డ్‌ కప్‌

Published Sun, Nov 19 2023 12:52 AM

మాదలింగి నుంచి కురుపాం వెళ్లే రోడ్డులో హల్‌చల్‌ చేస్తున్న ఏనుగుల గుంపు  - Sakshi

కొత్తవలస: మండలంలోని దెందేరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల డ్రాయింగ్‌ టీచర్‌ జి.ఎం.జి.పరమేశ్వరరావు పెన్సిల్‌ మొనపై క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ను చెక్కి అబ్బుర పర్చారు. వరల్డ్‌కప్‌ను భారత్‌ సాధించాలనే సంకల్పంతో మూడు గంటలు శ్రమించి వరల్డ్‌ కప్‌ను చెక్కినట్టు తెలిపారు. ఆయనను పాఠశాల హెచ్‌ఎం సునీత, ఇతర భోదనా సిబ్బంది అభిందించారు.

మాదలింగిలో

ఏనుగుల సంచారం

కొమరాడ: మండలంలోని మాదలింగి నుంచి కురుపాం వెళ్లేదారిలో ఏనుగుల గుంపు శనివారం సంచరించింది. రోడ్డు పక్కన ఉన్న పామాయిల్‌తోటలో తిష్టావేశాయి. కురుపాం వైపు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఒంటరి ఏనుగు జాడ గత పది రోజులుగా తెలియడం లేదని, ఒడిశావైపు వెళ్లి ఉంటుందని అటవీశాఖ సిబ్బంది భావిస్తున్నారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి

పార్వతీపురం టౌన్‌: ౖరెలు ఢీకొనడతో పార్వతీపురం పట్టణం కొత్తవలసలో కొత్త వీధికి చెందిన పంచాది కృష్ణ(61) మృతిచెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ ఫారమ్‌ సమీపంలో మృతదేహం ఉందని రైల్వే పోలీసులకు సమాచారం అందింది. వారు వెళ్లి పరిశీలించి మృతుడిని గుర్తించారు. ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి రెండవ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌కు వెళ్తుండగా రైలు ఢీకొన్నట్టు అనుమానిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు జీఆర్‌పీ ఇన్‌చార్జి రత్నకుమార్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ...

పార్వతీపురం టౌన్‌: కురుపాం మండలం నీలకంఠాపురం గ్రామానికి చెందిన ఊయక హరిబాబు(28) తన భార్యను కొట్టిన క్రమంలో తీవ్ర మనస్థాపం చెందాడు. శుక్రవారం పురుగుల మందును సేవించి అపస్మారక స్థితికి చేరాడు. గమనించిన కుటుంబ సభ్యులు తొలుత నీలకంఠాపురం పీహెచ్‌సీలో వైద్యసేవలందించారు. పరిస్థితి విషమించడంతో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి శనివారం తీసుకువచ్చారు. ఇక్కడ వైద్యసేవలు పొందుతూ హరిబాబు మరణించారు. ఘటనపై ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేశారు.

రైల్వే ట్రాక్‌పై మృతుడు పంచాది కృష్ణ
1/3

రైల్వే ట్రాక్‌పై మృతుడు పంచాది కృష్ణ

జిల్లా ఆస్పత్రిలో హరిబాబు మృతదేహం
2/3

జిల్లా ఆస్పత్రిలో హరిబాబు మృతదేహం

3/3

 
Advertisement
 
Advertisement