నాకు గ్రామంలో రెండు చోట్ల స్థలాలు ఉన్నాయి. అందులో సెంటున్నర ఉన్న స్థలానికి ముందు, వెనుక రోడ్లు వేయడంతో నా స్థలం సెంటు లోపల మిగిలింది. కనీసం ఉండేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. సమస్య పరిష్కరించాలని 2022 నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకొంటూ సమస్య పరిష్కరించకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి అనేకమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు.
– ఎస్. ఆంజనేయరాజు,
బొగ్గరం, ఈపూరు మండలం


