చెవి కెక్కించుకోండి..! | - | Sakshi
Sakshi News home page

చెవి కెక్కించుకోండి..!

Mar 3 2026 8:15 AM | Updated on Mar 3 2026 8:15 AM

● పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటతో పాటు సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల ప్రాంతాల్లోని వైద్యవిధాన పరిషత్‌ వైద్యశాలలకు నిత్యం 20–25 మంది చెవిలో ఇబ్బందులతో వస్తున్నారు. ● వినికిడి సమస్య ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే ఈఎన్‌టీ వైద్యులు, ఆడియాలజిస్టు వద్దకు వెళ్లి ఆడియోమెట్రి పరీక్ష చేయించుకోవాలి. పరీక్ష తర్వాత సెన్సార్‌ హియరింగ్‌ లాస్‌ అయితే వినికిడి మిషన్‌, హియరింగ్‌ ఎయిడ్‌ తప్పనిసరిగా వాడాలి. ● ఆధునిక టెక్నాలజీతో కంప్యూటరైజ్డ్‌ వినికిడి మిషన్లు వచ్చాక చాలా మంది వాటిని వాడటం సులభంగా మారింది. పుట్టుకతో వినికిడి సమస్య ఉన్న పిల్లలకు వినికిడి మిషన్‌లు అమర్చి స్పీచ్‌థెరపి ఇప్పిస్తే వారు త్వరగా మాటలు వినడమే కాక అర్థం చేసుకొని తిరిగి మాట్లాడేందుకు సులభం అవుతుంది. ● ధ్వని ఎక్కువగా ఉండే పరిసరాల్లో ఉండటం ● మొబైల్‌, బ్లూటూత్‌, హెడ్‌ ఫోన్లో పెద్ద శబ్దంతో మ్యూజిక్‌ వినడం ● వాహనాల శబ్దాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండడం ● జన్యు కారణాలు, పుట్టుకతో వచ్చే లోపాలు ● మేనరికం, వంశపారంపర్యంగా రావడం ● వృద్ధాప్యం, చెవి మధ్యలో ఇన్ఫెక్షన్‌

బ్లూటూత్‌ హెడ్‌ ఫోన్లతో వినికిడి సమస్య పెద్దగా మ్యూజిక్‌ వినడంతో ఇబ్బందులు కొందరికి పుట్టుకతో వినికిడి లోపం పరిష్కారం చూపుతున్న ఆధునిక హియరింగ్‌ ఎయిడ్లు నేడు ప్రపంచ వినికిడి సమస్య అవగాహన దినం

వినికిడి సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

చెవి శుభ్రతకు బడ్స్‌, పిన్ను, సూదులు ఉపయోగించకూడదు

చెవిలో నొప్పికి నూనె, ఆకు పసర్లు వేయకూడదు

చెవిలో చీము కారుతుంటే స్విమ్మింగ్‌ చేయకూడదు

ఎక్కువ శబ్దాలు వచ్చే ప్రదేశంలో పనిచేసేవారు ఇయర్‌ ప్లగ్స్‌ వాడాలి

ప్రతి ఆరు నెలలకు ఒకసారి వినికిడి పరీక్ష చేయించుకోవడం మంచిది

సత్తెనపల్లి: స్మార్ట్‌ ఫోన్‌ అధిక వినియోగం ఎన్నో అనర్థాలకు దారితీస్తోంది. వినికిడి సమస్య బాధితులు పెరుగుతున్నారు. బ్లూటూత్‌ హెడ్‌ సెట్‌ వినియోగించడం తదితర కారణాలతో వినికిడి సమస్య ఏర్పడి అవస్థలు పడుతున్నారు. వినికిడి సమస్యను అధిగమించేందుకు ఏటా మార్చి 3న ప్రపంచ వినికిడి సమస్య అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో వినికిడి సమస్యతో బాధపడు తున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది.

వినికిడి పరీక్ష ఇలా చేయించుకోవాలి

వినికిడి సమస్యకు కారణాలు..

చిన్నపిల్లల్లో దగ్గు, జలుబు వచ్చినప్పుడు చెవి బ్లాక్‌ అవుతుంది. ఒక్కోసారి వినికిడి సమస్య రావచ్చు. చెవి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే వినికిడి లోపాలకు దారి తీసే ప్రమాదం ఉంది. సమస్యను గుర్తించినప్పుడు జాప్యం చేయకుండా ఈఎన్‌టీ వైద్యులను సంప్రదిస్తే చికిత్స చేస్తారు. పెద్దలలో నరాల బలహీనత వల్ల వినికిడి సమస్య వస్తుంది. వీరికి ఆడియో మెట్రి పరీక్షలు చేసి మందులు వాడాల్సి ఉంటుంది.

– డాక్టర్‌ మాధురి,

ఈఎన్‌టీ వైద్యురాలు, సత్తెనపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement