నరసరావుపేట: ఆపదలో ఉన్న మహిళలు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్‌శక్తి వన్‌స్టాప్ సెంటర్‌కు సంబంధించిన అత్యవసర వాహనాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆ వాహనానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలకు ఈ వాహనం ద్వారా వైద్యశాలకు, సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ సేవల కోసం టోల్‌ఫ్రీ నంబరు 181, 1098 సంప్రదించాలని కోరారు. మహిళాభివృద్ధిశాఖ పీడీ ఉమాదేవి, మిషన్‌శక్తి కో–ఆర్డినేటర్, వన్‌స్టాఫ్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ, దిగువ సన్నిధితో పాటు ఉపాలయాలను కూడా ద్వారబంధనం చేయనున్నామని, తిరిగి బుధవారం గ్రహణ శుద్ధి అనంతరం ఉదయం 7 గంటలకు స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


