సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో.. | - | Sakshi
Sakshi News home page

సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో..

Nov 17 2025 8:26 AM | Updated on Nov 17 2025 8:26 AM

సమాధా

సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో..

సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో..

నరసరావుపేట టౌన్‌: రైల్లో గంజాయి చాక్‌లెట్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమార్కులు రైల్లో గంజాయి కలిగిన చాక్‌లెట్లను రవాణా చేస్తున్నారు. గతంలో నరసరావుపేట మండలం కోటప్పకొండలో ఇలాంటి చాక్‌లెట్లు పట్టుబడిన విషయం విదితమే. తాజాగా రైల్లో రూ.50 వేల విలువ కలిగిన 1,920 చాక్‌లెట్లు చిక్కడం కలకలం రేపుతోంది. శుక్రవారం అర్ధరాత్రి భువనేశ్వర్‌ నుంచి బెంగళూర్‌ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఈగల్‌, ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఎస్‌–4 కంపార్ట్‌మెంట్‌లో ఉన్న 45 చాక్‌లెట్ల ప్యాకెట్ల బ్యాగ్‌ను గుర్తించారు. వాటిలో మొత్తం 1,920 గంజాయి కలిగిన చాక్‌లెట్లు ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం బోగీల్లో గాలించగా ప్రయోజనం దక్కలేదు. దీంతో బోగీల్లో ప్రయాణికుల వివరాలను సేకరించారు. అనుమానితులను గుర్తించి.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రెండోసారి పట్టివేత

గంజాయి కలిగిన చాక్‌లెట్లు రాష్ట్రంలో మొట్టమొదటిసారి నరసరావుపేట మండలం కోటప్పకొండలో గతంలో పట్టుబడ్డాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి అక్కడి నుంచి మత్తు చాక్‌లెట్లను తీసుకొచ్చి రాష్ట్రంలో విక్రయిస్తుండగా.. అధికారులు పట్టుకున్నారు. తాజాగా రైల్లో అక్రమంగా తరలిస్తూ నరసరావుపేటలో గంజాయి చాక్‌లెట్లు మరోమారు పట్టుబడటం విశేషం. విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న నరసరావుపేటలో గంజాయి చాక్‌లెట్ల సంస్కృతి రావటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలును కేంద్రంగా చేసుకొని గంజాయి, గంజాయి చాక్‌లెట్లను అక్రమార్కులు తరలిస్తున్నట్లు పోలీసులు భావించి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సవాల్‌గా మారిన నిందితుల గుర్తింపు

రైల్లో గంజాయి చాక్‌లెట్లు మాత్రమే లభ్యమయ్యాయి. వాటిని తీసుకొస్తున్న నిందితులు, వారి ని తెరవెనుక నుంచి నడిపించిన సూత్రధారుల వివరాలేమీ లభ్యం కాలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ పోలీసులకు పురోగతి లభించలేదు. వినుకొండలో దిగిన వ్యక్తి కదలికలపై అనుమానం ఉండటంతో ఈగల్‌ టీమ్‌ ఎస్‌ఐ శ్యామ్యూయేల్‌ రాజీవ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం అక్కడికి వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు.

భువనేశ్వర్‌ నుంచి బెంగుళూర్‌కు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ అనేక జిల్లాలు దాటుకొని నరసరావుపేట మీదుగా వెళ్తుంది. ఒడిశాలో అక్రమార్కులు గంజాయి, గంజాయి కలిగిన చాక్‌లెట్లను తక్కువ ధరకు అక్కడ కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రైలును అక్రమ తరలింపునకు కేంద్రంగా వాడుతున్నారు. తనిఖీల్లో ఎక్కడా గంజాయి బ్యాగ్‌లను అధికారులు గుర్తించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమానాస్పదంగా బోగీల్లో బ్యాగ్‌లు కనిపిస్తే వాటిని పోలీసులు పరిశీలించటం సర్వసాధారణం. గంజాయి చాక్‌లెట్ల బ్యాగ్‌ ఇతర రాష్ట్రాల నుంచి అనేక స్టేషన్లు దాటి వస్తున్నా పట్టుకోకపోవటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో.. 1
1/1

సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement