గవర్నర్‌కు ఘనస్వాగతం
బాపట్ల: బాపట్ల మండలం పాండురంగపురంలో ఆదివారం జరిగే ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. ఎస్పీ ఉమామహేశ్వర్, జాయింట్ కలెక్టర్ భావన, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, డీఎస్పీ రామాంజనేయులు, బాపట్ల, చీరాల తహసీల్దార్లు షేక్ సలీమ, గోపికృష్ణ తదితరులు కూడా స్వాగతం పలికారు.
మంగళగిరి టౌన్: ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కడం వల్ల ఫిట్‌నెస్ సాధించడంతోపాటు ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ఏపీ బెటాలియన్స్ ఐజీ బి.రాజకుమారి పేర్కొన్నారు. మంగళగిరి నగర పరిధిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో ఆదివారం క్విట్ ఇండియా ఫిట్‌నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. అనంతరం సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ బెటాలియన్ నుంచి ప్రారంభమై చినకాకాని ఎన్‌ఆర్‌ఐ జంక్షన్ వరకు వెళ్లి, తిరిగి బెటాలియన్‌కు చేరుకుంది. రాజకుమారి మాట్లాడుతూ సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిత్యం అరగంట సైక్లింగ్ చేయాలని సూచించారు. బెటాలియన్ కమాండెంట్ నగేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిరూరల్: హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో తాడేపల్లి రూరల్ పరిధిలోని కొలనుకొండలో ఉన్న హరేకృష్ణ గోకుల క్షేత్రంలో ఆదివారం లక్ష దీపోత్సవం కార్యక్రమం ఏర్పాటైంది. తులసి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు 30 లక్షల హరి నామాలకు జపించారు. నృత్య రూపంలో కృష్ణలీలను ప్రదర్శించగా, భక్తులు తిలకించారు. మూమెంట్ అధ్యక్షుడు వంశీధర దాస మాట్లాడుతూ సంధ్యాహారతి, సంకీర్తన, ప్రవచనం, కార్తిక మాస దీపోత్సవ ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. లక్ష దీపోత్సవ కార్యక్రమం 20వ తేదీ వరకు నిర్వహించనున్నామని, భక్తులు విజయవంతం చేయాలన్నారు. హరేకృష్ణ గోకుల క్షేత్రం ప్రతినిధులు విలాస దాస, రఘునందన దాస తదితరులు పాల్గొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం 586.60 అడుగులకు చేరింది. ఇది మొత్తం 303.4310 టీఎంసీలకు సమానం. కుడి కాలువకు 10 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వనమ అక్షయ్‌కుమార్ కుటుంబం ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116, హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చెందిన పట్టపు భగవత్ ప్రసాద్, చంద్రావతిల పేరిట అన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. అలాగే శ్రీకాకుళంకు చెందిన ఎం. ప్రభాకర్ దంపతులు జోషియా జయశ్రీ, జోశ్రీక జయశ్రీల పేరిట నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను బహూకరించారు.
గవర్నర్‌కు ఘనస్వాగతం
గవర్నర్‌కు ఘనస్వాగతం
గవర్నర్‌కు ఘనస్వాగతం


