అటల్ టింకరింగ్ ల్యాబ్ పరిశీలన
పెదకూరపాడు: 75త్యాళ్ళూరు జిల్లా పరిషత్ హైస్కూల్లోని అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను రాష్ట్ర బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి, విద్యార్థులతో సంభాషించి, వారు చేస్తున్న ప్రాజెక్టులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ స్టేట్ ఆఫీసర్, యునిసెఫ్ కన్సల్టెంట్ సుదర్శన్ మాట్లాడుతూ రానున్న కాలం అంతా రోబోటిక్, డిజిటల్ టెక్నాలజీదేనని, విద్యార్థులు నూతన టెక్నాలజీని ఉపయోగించి తాము తయారుచేసిన నమూనాలకు స్టార్టప్ ప్రోగ్రాం కింద ప్రోత్సాహక నగదు, పేటెంట్ పొందవచ్చన్నారు. ఇన్నోవేటివ్ స్పిరిట్‌తో విద్యార్థులు ముందడుగు వేయాలని అన్నారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజశేఖర్ మాట్లాడుతూ భవిష్యత్తులో విన్నూతనమైన ప్రాజెక్టులను తయారు చేయడానికి విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించాలన్నారు. హెచ్‌ఎం ఎ.శ్రీనివాస రెడ్డి, అటల్ ల్యాబ్ ఇన్‌చార్జి కె.వి.సుబ్బారావు, ఈఆర్‌డీసీకి చెందిన అమర్, మెంటర్ సుస్మిత, సీఆర్పీ శివ, సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


