వర్సిటీ క్రికెట్‌ జట్టులో కృష్ణవేణి విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

వర్సిటీ క్రికెట్‌ జట్టులో కృష్ణవేణి విద్యార్థి

Jan 15 2026 8:37 AM | Updated on Jan 15 2026 8:37 AM

వర్సిటీ క్రికెట్‌ జట్టులో కృష్ణవేణి విద్యార్థి

వర్సిటీ క్రికెట్‌ జట్టులో కృష్ణవేణి విద్యార్థి

నరసరావుపేట ఈస్ట్‌: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పురుషుల క్రికెట్‌ జట్టుకు కృష్ణవేణి కళాశాల విద్యార్థి జి.ప్రవీణ్‌కుమార్‌ ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ నాతాని వెంకటేశ్వర్లు, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు బుధవారం తెలిపారు. వర్సిటీ అంతర్‌ కళాశాలల పురుషుల క్రికెట్‌ పోటీలు, జట్టు ఎంపికలో తమ విద్యార్థి ప్రవీణ్‌ ప్రతిభ కనపరిచి వర్సిటీ జట్టులో స్థానం సాధించాడని వివరించారు. కర్నాటకలోని మంగుళూరు విశ్వవిద్యాలయంలో ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగనున్న సౌత్‌జోన్‌ అంతర్‌ విశ్వవిద్యాలయాల పురుషుల క్రికెట్‌ టోర్నమెంట్‌లో ప్రవీణ్‌ ఏఎన్‌యూకు ప్రాతినిథ్యం వహిస్తాడని తెలి

చెట్టును ఢీకొన్న కారు..

ఒకరి మృతి: ఇద్దరికి గాయాలు

ప్రత్తిపాడు: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన అంచా వెంకట సువర్ణ అనే వృద్ధురాలు తన ఇద్దరు కుమారులతో కలిసి బుధవారం ప్రత్తిపాడు మండలం గనికపూడిలో దేవర కార్యక్రమానికి వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తరువాత మహేంద్ర ఎక్స్‌యూవీ వాహనంలో గుంటూరుకు తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యలో ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం సమీపంలో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వెంకట సువర్ణతో పాటు కారు నడుపుతున్న అంచా శ్రీనివాసరావులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో గుంటూరుకు తరలించారు. కాగా అందులో ప్రయాణిస్తున్న అంచా భాను ప్రసాద్‌ (60) తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదానికి నిద్రమత్తు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షతగాత్రులది స్వగ్రామం గనికపూడి కాగా కొన్నేళ్లుగా గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్తిపాడు ఎస్‌ఐ ఎన్‌.నరహరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement