ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు.. | - | Sakshi
Sakshi News home page

ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు..

Published Tue, Mar 18 2025 8:41 AM | Last Updated on Tue, Mar 18 2025 8:39 AM

సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన వారికి సత్వరమే న్యాయం చేయకపోగా, వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలతో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలకు తమ గోడును విన్నివించుకోని రశీదుతో వెళ్లిన వారికి రిక్తహస్తమే దక్కుతోంది. ఫిర్యాదుకు నిర్ణయించిన గడువులోగా పరిష్కారం చూపకపోవడంతో ఫిర్యా దులు రీ ఓపెన్‌ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఏడాది జూన్‌ 15వ తేదీ నుంచి ఇప్పటివరకు కలెక్టరేట్‌లో 13,695 ఫిర్యాదుల అందగా వాటిలో 12,277 ఫిర్యాదులు పరిష్కారం చూపగా, 1,418 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. సుమారు 500 ఫిర్యాదుల రీ ఓపెన్‌ అయ్యాయి. ఇందులో అత్యధికంగా రెవె న్యూ, సర్వే, పంచాయతీరాజ్‌ శాఖలకు సంబంధించిన ఫిర్యాదుల రీ ఓపెన్‌ అవుతున్నాయి. గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగివేసారి కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చినా సత్వరం న్యాయం జరగడంలేదని బాధితులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో మాదిరి ి స్పందన ఉండటం లేదని వాపోతున్నారు.

గతంలో సత్వర పరిష్కారం..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా స్పందన ఫిర్యాదుల పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేవారు. ఇందులో పనిచేసే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుడు, సంబంధిత అధికారులు, ఆయా మండలాల ప్రత్యేక అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేవరకు పనిచేసేవారు. దీనివల్ల ఫిర్యాదుదారులకు సత్వరమే సమస్య పరిష్కారం, లేదా కాకపోవడానికి గల కారణాలు తెలిసేవి. కొత్త ప్రభుత్వం వచ్చాక కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూంకు స్వస్తిపలికారు. ప్రస్తుతం పీజీఆర్‌ఎస్‌ సిబ్బంది, ప్రత్యేకాధికారులు ఈ పనిచేస్తున్నా గతంలో లాగా పారదర్శకత ఉండటం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశించినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సోమవారం ప్రజా పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులు కొన్ని..

ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసేందుకు వచ్చిన అల్లూరివారి పాలెం, ఎస్టీకాలనీ వాసులు

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు క్యూ కడుతున్న అర్జీదారులు గత పది నెలల్లో కలెక్టరేట్‌లో సుమారు 500 అర్జీలు రీ ఓపెన్‌ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు పదేపదే వెళ్లినా తీరని సమస్యలు గత ప్రభుత్వం హయాంలో సచివాలయ సిబ్బందితో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ సమస్య పరిష్కారం అయ్యేవరకు పర్యవేక్షణ నేడు కలెక్టర్‌ చెప్పినా కింద స్థాయిలో పట్టించుకోవడం లేదని వాపోతున్న ఫిర్యాదుదారులు

మేము 54 మందిమి గత ఐదేళ్లుగా మున్సి పాల్టీలోని పారిశుద్ధ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నాం. మాకు అరకొర జీతాలే చెల్లిస్తున్నారు. మొదట మున్సిపల్‌ శాఖనుంచి, ఆ తర్వాత ఆప్కాస్‌ ద్వారా చెల్లిస్తున్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐలు కట్‌ చేస్తున్నారు. వాటికి కార్డు ఇవ్వలేదు. మాకు ఒక్కో నెల ఒక్కోరకంగా జీతం ఇస్తున్నారు. పూర్తి నెల జీతం అందించడం లేదు. మున్సిపల్‌ ఉద్యోగులనే కారణంతో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ఎన్నోసార్లు వినతిపత్రాలు, అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. రెగ్యులర్‌ కాంట్రాక్ట్‌ కార్మికులుగా గుర్తించి, నెలకు రూ.21వేలు వేతనం చెల్లించాలి.

– కార్మికులు, నాయకులు, పల్నాడు మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌

ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు.. 1
1/1

ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement