మూగ రోదన..తీరని వేదన | - | Sakshi
Sakshi News home page

మూగ రోదన..తీరని వేదన

Jan 17 2026 8:52 AM | Updated on Jan 17 2026 8:52 AM

మూగ ర

మూగ రోదన..తీరని వేదన

జిల్లాలో కుంటుపడుతున్న పశువైద్యం

సమయానికి తెరవని పశు వైద్యశాలలు అందుబాటులో లేని పశు వైద్య బృందం జిల్లాలోని పశు వైద్యశాలల్లో మందుల కొరత రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన మందుల సరఫరా పశువులకు సీజనల్‌ వ్యాధుల ముప్పు పట్టించుకోని పశువైద్యశాఖ అధికారులు

జిల్లాలో కుంటుపడుతున్న పశువైద్యం

సత్తెనపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో పశు వైద్యం గాలిలో దీపమైంది. వైద్య బృందం అందుబాటులో లేక పశువైద్యం కడుదైన్యంగా మారుతోంది. మందుల కొరత వేధిస్తోంది. జిల్లాలో అధిక శాతం కుటుంబాలు పశుసంపద ఆధారంగా జీవనం సాగిస్తున్నాయి. పశుసంపద రక్షణ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం పశు వైద్యం పై చిన్న చూపు చూస్తోంది.

పశువైద్యశాలలో మందుల కొరత...

జిల్లాలో ఏరియా పశువైద్యశాలలు 14, వెటర్నరీ డిస్పెన్సరీ వైద్యశాలలు 64, రూరల్‌ లైవ్‌స్టాక్‌ యూనిట్లు 37, గోపాల మిత్ర కేంద్రాలు 98, రైతు సేవా కేంద్రాలు 246 ఉన్నాయి. ఈ పశువైద్యశాలల్లో మందులు కొరత వేధిస్తుంది. ఒకటి ఉంటే రెండు లేవని అక్కడ సిబ్బంది వాపోతున్నారు. ప్రాథమిక మందులు కూడా లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాయం అయితే వైద్యం చేయడానికి కాటన్‌, టించర్‌ సైతం లేదని సిబ్బంది చెబుతున్నారు. ప్రధానంగా వైద్యశాలల ఆవరణంలో నీటి వసతి కరువవుతోంది. సీజనల్‌ వ్యాధులకు సంబంధించిన మందులు పూర్తిస్థాయిలో లేవు. అలాగే చికిత్స అందించేందుకు కావలసినవీ లేవని అంటున్నారు.

సక్రమంగా అందని వైద్య సేవలు...

జిల్లాలో ప్రతిచోట పశుసంపద వృద్ధి చెందుతోంది. అయితే దీనికి తగ్గట్టు క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా చాలా వైద్యశాలలో వైద్యులు ఉండడం లేదు. కొందరు వైద్యులు సమావేశాల పేరుతో కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు సొంత పనులకు పరిమితం అవుతున్నారు. డెప్యుటేషన్ల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సిబ్బంది లేక కొన్నిచోట్ల, మరికొన్ని చోట్ల సిబ్బంది ఉన్నా విధులకు రాక కొన్ని వైద్యశాలల తలుపులు తెరుచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వచ్చినా మధ్యాహ్ననికి తలుపులు వేసి వెళ్ళిపోతున్నారు. దీంతో పాడి రైతులు పశువైద్యం కోసం అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల రైతు సేవా కేంద్రాల్లోనూ సిబ్బంది అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సమయానికి పాడిపశువులకు వైద్యం అందించాలని వేడుకున్నా సిబ్బంది తమను చిన్నచూపు చూస్తున్నారని పాడి రైతులు వాపోతున్నారు.

ప్రైవేటు వ్యక్తుల చేతిలో పశువైద్యం...

జిల్లాలో 9 పశువైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలుచోట్ల ప్రభుత్వ వైద్య బృందం అందుబాటులో లేని కారణంగా పాడి రైతులు పశు వైద్యం కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. గోపాలమిత్రలుగా పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు ప్రైవేటు వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఊరురా తిరుగుతూ వారి సేవలను విస్తరించుకుంటున్నారు. అలాగే కొంతమంది వ్యక్తులు ఎలాంటి విద్యార్హత లేకుండా పశు వైద్యం చేస్తున్నారు.

మూగ రోదన..తీరని వేదన 1
1/1

మూగ రోదన..తీరని వేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement