మండవ, పెనుగొండ కుటుంబ సభ్యుల సంక్రాంతి
నరసరావుపేట: ఉమ్మడి కుటుంబాలు ఛిద్రమై ఎవరికి వారే యమునాతీరే అనే చందంగా వ్యవహరిస్తున్న నేటి రోజుల్లో పట్టణంలోని మండవ, పెనుగొండ అనే ప్రముఖ ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన వారంతా ఒక చోట చేరి సంక్రాంతి పండగను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. నరసరావుపేట పట్టణంలో సంక్రాంతి సందర్భంగా నాలుగు తరాలకు చెందిన మండవ, పెనుగొండ కుటుంబాలకు చెందిన సుమారు 100మంది కుటుంబ సభ్యులు ఒక చోట చేరి పండగను ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకున్నారు. చైన్నె, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నరసరావుపేటలో నివాసం ఉండే ఆ రెండు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు అందరూ సంక్రాంతికి నరసరావుపేట వచ్చి పండగ నిర్వహించుకోవటం ఇది 13వ సారి. స్థానిక సీతారామస్వామి దేవాలయంలోని శ్రీనివాస కల్యాణ మండపంలో ఈ మూడు రోజులు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సరదా గేమ్స్, క్విజ్‌లతో అనందంగా గడిపారు. వీరు వివిధ రకాల వ్యాపారులతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు.
రెండు కుటుంబాలకు చెందిన వందమంది ఒక చోట చేరి సంబరాలు