నరసరావుపేటలో చాలా మద్యం దుకాణాలు ఉదయం 6 గంటల నుంచే షాపులు తెరిచి మద్యం విక్రయాలు చేస్తున్నారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కూడా అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసంలో ఇబ్బందికరంగా ఉంది. పట్టణంలో ప్రముఖ మసీదుల వద్ద ఉన్న మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద మరీ ఇబ్బందికరంగా మారింది.. అలాగే ఈద్గా మైదానంలో రాత్రిళ్లు మద్యం సేవిస్తున్నారు. ఎకై ్సజ్ విభాగం చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి.
– షేక్ కరిముల్లా, ఎంఐఎం జిల్లా కార్యదర్శి