అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే బాహిణీపతి
జయపురం : అస్వస్థతకు గురై కొద్ది నెలలుగా చికిత్స పొందిన జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఎట్టకేలకు కోలుకున్నారు. మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్డొన్నారు. స్థానిక బాబాసాహెబ్ కళ్యాణ మండపంలో మునిసిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సురక్షా బిన్నక్షమ సహసీ్త్రకరణ విభాగం, ఒడిశా సహకారంతో మధుబాబు పెన్షన్ పథకంలో భాగంగా కొత్తగా పింఛన్ మంజూరైన 826 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చైర్మన్ మహంతి, తదితరులు పాల్గొన్నారు.
అటవీ భూముల పట్టాలు పంపిణీ
మల్కన్‌గిరి: గోవిందపల్లి పంచాయతీ దామాబేడా గ్రామానికి చెందిన 79 మంది గిరిజనులకు మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖీలో మంగళవారం అటవీ భూముల పట్టాలను పంపిణీ చేశారు. మత్తిలి అటవీ విభాగ అధికారి బసుదేవ నాయక్ అధ్యక్షతన ముందుగా అటవీ అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. గోవిందపల్లి సర్పంచ్ శ్రీనివాస్ ముదిలి, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర బార్‌కౌన్సిల్‌కు రెండు నామినేషన్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయవాదుల రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, ఇతర సభ్యులతో కలిసి 25 మందిని ఎన్నుకుంటారు. ఫిబ్రవరి 13న జరిగే ఈ ఎన్నికకు జిల్లా నుంచి ఇద్దరు న్యాయవాదులు కిల్లి మార్కండేశ్వరరావు, గేదెల వాసుదేవరావు నామినేషన్ వేశారు. వీరిలో ఇప్పటికే బార్ కౌన్సిల్ సభ్యులుగా గేదెల వాసుదేవరావు ఉండగా, కొత్తగా జిల్లా నుంచి మార్కండేశ్వరరావు పోటీలోకి దిగారు. మినేషన్ ప్రక్రియ ఈ నెల 13తో ముగిసింది. జిల్లాలో 1316 మంది న్యాయవాదులు బార్ కౌన్సిల్‌కు ఓటు వేయనున్నారు.
అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే బాహిణీపతి


