ఆధునిక వ్యవసాయాన్ని అలవర్చుకోవాలి
మల్కన్‌గిరి: రైతులు ఆధునికీ పద్ధతుల్లో వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని అధికారులు అన్నారు. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని సాంస్కృతిక భవన్‌లో జలసంపద శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పాణి పంచాయతీ పక్షం–2026ను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోటేరు సాగునీటి ప్రాజెక్ట్ ప్రధాన ఇంజినీర్ తృప్తకుమార్ పాత్రో అధ్యక్షత వహించారు. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు పతితపావన ముఖ్యఅతిథిగా హాజరై వ్యవసాయంలో ఆధునికీ విజ్ఞానం, సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నిహార్ రాయ్, చిత్రకొండ ఎమ్మెల్యే ప్రతినిధి గోవింద చంద్ర పాత్రో, జిల్లా జల విభాగం ప్రాజెక్టు డైరెక్టర్ సమీర్ శబర్ పాల్గొన్నారు.
ఆధునిక వ్యవసాయాన్ని అలవర్చుకోవాలి


