తిరుపతి పాణిగ్రాహికి సత్కారం
పర్లాకిమిడి: ఒడిశాలో దీర్ఘకాలికంగా విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన హైటెక్ విద్యాసంస్థల చైర్మన్, పర్లాకిమిడి స్వాభిమాన్ మంచ్ అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహికి మణిపూర్‌లో ఘనంగా సత్కరించారు. ఇంఫాల్ విమానాశ్రయంలో వందలాది విద్యార్థులు, మేధావులు, కళాకారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. మణిపూర్‌లో మెడికల్ కళాశాల నిర్మాణానికి తిరుపతి పాణిగ్రాహి ముందుకు వచ్చారని అక్కడి విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి యువ పర్యావరణ వైజ్ఞానికులు లిపిప్రియా ప్రాతినిధ్యం వహించారు.


