రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని గుణుపూర్ సబ్‌డివిజన్ పరిధిలో గల లిమ్మాపొడ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నీలాగుడ గ్రామానికి చెందిన మున్నా కింవాక (19), కృష్ణ కింవాక (15) లు మృతి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం కోసం గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం నాడు నీలాగుడ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మున్నా, కృష్ణలు బైకుపై గుణుపూర్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలొ బైకు అదుపుతప్పి లిమ్మాపొడ గ్రామ సమీపంలో ఒక విద్యుత్ స్తంభానికి ఢీకొన్నారు. దీంతో తీవ్రగాయాలకు గురైన ఇద్దరూ సంఘటన స్థలం వద్దే ప్రాణాలు విడిచారు. అత్యంత వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి


