రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆర్‌సీడీ హైస్కూల్ మైదానంలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలుగు కల్చరల్ అసోసియేషన్ ప్రకటించింది. పట్టణంలోని వివిధ తెలుగు కుల, సమాజ సేవా సంఘాలకు చెందిన యువకులు ఐక్యంగా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ కల్యాణ మండపంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన చాంబర్ అధ్యక్షుడు మానస్ రంజన్ దాస్ (కను) ఈ కార్యక్రమానికి పూర్తి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. మిల్లర్ల సంఘం కూడా చేతులు కలిపింది. పార్టీలకు అతీతంగా కార్యక్రమం నిర్వహించాలని యువత నిర్ణయించింది. కార్యక్రమంలో విశాఖ పట్నంకి చెందిన రోషల్ లాల్ ఆర్కెస్ట్రాతో పాటు ఆంధ్రా నుంచి వివిధ కళాకారుల బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రముఖలంతా ఒకే వేదికపైకి రానున్నారు.
రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు
రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు


