త్వరలో రాష్ట్రంలో అత్యాధునిక లోక్ సేవా భవన్
భువనేశ్వర్: రాష్ట్రంలో కొత్తగా అత్యాధునిక లోక్ సేవా భవన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సోమవారం పునాది రాయి వేశారు. 71.13 ఎకరాల విస్తీర్ణ ప్రాంగణంలో లోక్ సేవా భవన్, రాష్ట్ర శాసన సభ ఒకే సముదాయంలో నిర్మితం అవుతాయి. రాష్ట్రంలో శాసన సభ నియోజక వర్గాల భావి పునర్విభజన దృష్ట్యా కొత్తగా నిర్మితం అవుతున్న శాసన సభలో 300 మంది సభ్యులకు వీలుగా సకల సౌకర్యాలతో ఈ భవన సముదాయం అత్యంత ఆధునికంగా నిర్మితం అవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రణాళిక వ్యయ అంచనా రూ.3,623 కోట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రూ. 6,700 కోట్ల విలువైన ప్రజా పనుల శాఖకు చెందిన 71 ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో దాదాపు రూ.5,630 కోట్ల పెట్టుబడితో 39 ప్రాజెక్టులకు పునాది రాయి వేయగా రూ. 1,070 కోట్ల పెట్టుబడితో 32 ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేశారు.
త్వరలో రాష్ట్రంలో అత్యాధునిక లోక్ సేవా భవన్


