విక్రమదేవ్‌ వర్మ జయంతికి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

విక్రమదేవ్‌ వర్మ జయంతికి ఏర్పాట్లు

Jun 24 2025 3:25 AM | Updated on Jun 24 2025 3:25 AM

విక్రమదేవ్‌ వర్మ జయంతికి ఏర్పాట్లు

విక్రమదేవ్‌ వర్మ జయంతికి ఏర్పాట్లు

జయపురం: సాహితీ సామ్రాట్‌, జయపురం మహారాజు విక్రమదేవ్‌ వర్మ జయంతి ఉత్సవాలు ఈ నెల 28న అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించారు. ఒడిశా సాహిత్య అకాడమీ, జయపురం సాహిత్య పరిషత్‌లు సంయుక్తంగా విక్రమదేవ్‌ వర్మ జయంతి జరుపనున్నాయి. సోమవారం జయపురం సమితి అంబాగుడ కాళీమందిరంలో విక్రమ దేవ్‌ జయంతి శుభారంభం పూజలు చేశారు. అనంతరం విక్రమదేవ్‌ జయంతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జయపురం మోడరన్‌ ఇంగ్లిష్‌ మీడియమ్‌ స్కూలు, అరవింద నగర్‌ సరస్వతీ విద్యా మందిర్‌, మున్సిపాలిటీ విద్యాలయాల్లో జయంతి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక మోడరన్‌ స్కూలు ప్రాంగణంలో జయపురం సాహిత్య పరిషత్‌ అధ్యక్షులు హరిహర కరసుధా పట్నాయిక్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జయంతి ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. అవిభక్త కొరాపుట్‌ స్థాయిలో 15 దినాలు ఉత్సవాలు జరపాలని తీర్మానించారు. విక్రమదేవ్‌ చరిత్ర విద్యార్థులందరికీ తెలిసేటట్టు ప్రతి పాఠశాలలో విక్రమదేవ్‌ వర్మపై చర్చా వేదికలు నిర్విహించాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement