ప్రజల్లోకి ముఖ్యమంత్రి
● తొలిసారి రాజధాని బయట
గ్రీవెన్స్‌న్‌సెల్
● సంబల్‌పూర్‌లో వినతులు స్వీకరించిన సీఎం మోహన్‌చరణ్ మాఝి
● హాజరైన 11 మంది క్యాబినెట్ మంత్రులు
నిర్వహిస్తామన్నారు.
భారీగా ఏర్పాట్లు..
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోహన్ చరణ్ మాఝి తొలిసారి బయట ప్రాంతంలో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి కనకవర్దన్‌సింగ్‌దేవ్, 10 మంది క్యాబినెట్ మంత్రులు, పదుల సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరై సామాన్య ప్రజలకు సేవలందించారు. సంబల్‌పూర్‌తో పాటు పశ్చిమ ఒడిశాలో అనేక జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు హాజరై సమస్యలు విన్నవించుకున్నారు. దివ్యాంగుల వద్దకు నేరుగా వెళ్లి సీఎం సమస్యలు వినడం ప్రత్యేకంగా నిలిచింది. మంత్రులు కూడా సాధారణ ప్రభుత్వ సిబ్బంది వలే పెన్నులు తీసుకొని వివరాలు నమోదు చేసుకోవడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రి కనక వర్దన్ సింగ్ దేవ్, మంత్రులు సూరజ్ సూర్యవంశీ, నిత్యానంద గొండో తదితరులు సిఎం పక్కనే ఉండి సహాయం చేశారు.
కొరాపుట్: ప్రజల కోసమే రాజధాని వదిలి సంబల్‌పూర్ వచ్చామని ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మాఝి ప్రకటించారు. సోమవారం సంబల్‌పూర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో సీఎంను కలవాలంటే మహానుభావులకే తపస్సు చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. తాము మాత్రం సీఎంను కలవలేని వారి కోసం ప్రజల్లోకే వచ్చామన్నారు. ఒక్కరోజే సుమారు 6 వేల మంది సమస్యలు పరిష్కరించామన్నారు. ఎక్కువగా సంబల్‌పూర్, బరగడ్ జిల్లాల ప్రజల నుంచే వచ్చాయన్నారు. ఇప్పటి వరకు తాను సీఎం అయిన తర్వాత 10 నెలలలో రాజధానిలో తొమ్మిది సార్లు గ్రీవెన్స్‌సెల్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతిసారీ వెయ్యికి పైగా సమస్యలు పరిష్కరించామన్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రజల్లోకి వచ్చి వినతులు స్వీకరించడం ఇదే తొలిసారన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సంబల్‌పూర్ సమలేశ్వరి దేవి కృతజ్ఞతగా ఉంటానన్నారు. భవిష్యత్‌లో ప్రతి జిల్లాలోనూ గ్రీవెన్స్‌సెల్
ప్రజల్లోకి ముఖ్యమంత్రి
ప్రజల్లోకి ముఖ్యమంత్రి


