సమస్యల కొలువు
మంచం కింద భార్య శవం హల్ది గ్రామంలో మంచం కింద భార్య శవం దొరికింది. భర్త పరారీలో ఉన్నాడు. –8లోu
పూర్తయిన డబ్లింగ్ కొత్తవలస–కిరండోల్ మధ్య డబ్లింగ్ పూర్తయ్యాయి. 85 కిలోమీటర్ల మేర పనులు జరిగాయి. –8లోu
రాయగడ: రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన సమితిగా గుర్తింపు పొందిన కాసీపూర్‌లో సమస్యలు కొలువుదీరాయి. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు లభించడం లేదు. సమితిలో సుమారు 482 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటి అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాజెక్టులు, పథకాలు అమలు చేస్తున్నా వాటి వలన ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఇప్పటికే ఈ సమితిలో సరైన రహదారులు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. గొడుబల్లి పంచాయతీలోని తిడిగుడ, పొడులుగుడ, లేఖాపాయి గ్రామాల్లో తాగునీటికి హాహాకారాలు చేస్తున్నారు. ఈ మూడు గ్రామాల్లో సుమారు వందకు పైబడిన ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి. అసలే వేసవికాలం కావడంతో వాగునీటిపై ఆధారపడే ఈ గ్రామ ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. వేసవి తీవ్రతకు వాగులు ఎండిపోవడంతో గుక్కెడు నీటికి కటకటలాడుతున్నారు. అదేవిధంగా రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు వీరి దరికి చేరలేకపోతున్నాయి. పీడీఎస్ బియ్యం, పెన్షన్ వంటివి తీసుకునేందుకు ఆరు కిలోమీటర్ల దూరం కాలినడకే వీరికి శరణ్యం. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా గ్రామాల వరకు చేరడం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తమ గ్రామాలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
సమస్యల కొలువు


