
అంబరాన్నంటిన ఆరాధనోత్సవం
పర్లాకిమిడి: చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో స్థానిక బిజూ కల్యాణ మండపంలో ఘంటసాల ఆరాధనోత్సవాలను సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డీఎన్ రావు, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ప్రారంభించారు. కార్యక్రమంలో హైటెక్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహికూడా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం మెగా మెడికల్ క్యాంపును కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంపులో 150మంది హృద్రోగ, మధుమేహాం, బి.పి. ఇతర వ్యాధులను తనిఖీలు చేయించుకున్నారు. విశాఖపట్నం నుండి డాక్టర్ కె.రామ్మూర్తి, కార్డియోలజిస్టు డాక్టర్ జి.మహేష్, పల్మనాలజిస్టు డాక్టర్ జి.శ్రీధర్, డాక్టర్ శరత్ కుమార్‌లు విచ్చేసి ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని చైతన్య ఆధ్వర్యంలో డాక్టర్ సయ్యద్ రహింతుల్లా పర్యవేక్షించారు. ఆదివారం సాయంత్రం చైతన్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఘంటసాల పాటలు, గానావధానం, కోలాటం, ఘంటసాల పాటలు ఆకట్టుకున్నాయి. కళాకారులకు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, ఆచార్య డి.ఎన్.రావు, తిరుపతి పాణిగ్రాహి చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు.

అంబరాన్నంటిన ఆరాధనోత్సవం