ఆత్మీయ నివాళి
శ్రమదానంతో రోడ్డు.. జంబుగుడలో స్థానికులే రోడ్డు వేసుకున్నారు. ఓ యువకుడు నాయకత్వం వహించాడు.
తొలగిన వివాదం బిజూ విగ్రహ ప్రతిష్టపై వివాదం తొలగింది. విగ్రహ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
–10లోu
బిజూ పట్నాయక్‌కు..
అమ్మవారి పండుగలు
పర్లామిడిలోని పలు ప్రాంతాల్లో అమ్మవారి పండుగలు జరుగుతున్నాయి. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
కొరాపుట్:
ఉత్కళ వర పుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నయక్ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. పార్టీలకు అతీతంగా బిజూను అంతా స్మరించుకున్నారు. రాజధాని భువనేశ్వర్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి, ఉప ముఖ్యమంత్రులు కనక వర్ధన్ సింగ్ దేవ్, ప్రబాతి పరిడా లో బిజూ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీ శ్రేణులతో కలసి వెళ్లి నివాళులర్పించారు. కొరాపుట్,నబరంగ్‌పూర్ జిల్లాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు.
రాయగడలో..
రాయగడ: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒడిశా వరపుత్రుడు బిజు పట్నాయక్ 28 వ వర్ధంతిని ఆ పార్టీ శ్రేణులు గురువారం జరుపుకున్నారు. స్థానిక కొత్తీ బస్టాండు వద్ద గల బిజు విగ్రహానికి రాజ్యసభ మాజీ ఎంపి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు, మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలొ పాల్గొని పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను నెక్కంటి ఈ సందర్భంగా కొనియాడారు.
జయపురంలో..
జయపురం: ఉత్కళ వరపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ బిజూ పట్నాయిక్ వర్ధంతి గురువారం జయపురం బీజేడీ శ్రేణులు జరుపుకున్నాయి. స్థానిక బిజూ భవనంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి రబినారాయణ నందో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడి: మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయిక్ 28వ వర్ధంతి సభను బీజేడీ పార్టీ శ్రేణులు పర్లాకిమిడిలో జరుపుకున్నారు. తొలుత మహేంద్రతనయ నది వద్ద బిజూ పట్నాయిక్ ఆత్మకు శాంతిచేకూరాలని తర్పణాలు విడిచారు. అనంతరం హైస్కూల్ జంక్షన్ వద్ద బిజూ పట్నాయక్ విగ్రహానికి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, బీజేడీ జిల్లా అధ్యక్షులు ప్రదీప్ నాయక్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నీలమ్మ గుడి వెనుక ఉన్న బీజేడీ పార్టీ కార్యాలయంలో శ్రద్ధాంజలి సభలో పాల్గొన్నారు. బిజూ పట్నాయిక్ ఒడిశా వరపుత్రుడని రాష్ట్రంలో ప్రగతి ప్రధాన నడిపించిన మహా నేతని సీనియర్ బీజేడీ నాయకులు ఎస్.గజపతి రావు అన్నారు.
న్యూస్‌రీల్
ఆత్మీయ నివాళి
ఆత్మీయ నివాళి
ఆత్మీయ నివాళి


