6 అంబులెన్స్‌ల వితరణ
కొరాపుట్: జిల్లా ప్రజలకు సేవలు అందించడానికి నాల్కో 6 అంబులెన్స్‌లు వితరణగా అందజేసింది. కొరాపుట్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ వి.కీర్తివాసన్ జెండా ఊపి ఈ అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొరాపుట్ జిల్లాలోని దమంజోడిలో భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) పరిశ్రమ బాకై ్సట్ పరిశ్రమ ఉంది. నాల్కో ఫెరిఫెరి డవలప్‌మెంట్ నిధులను కేటాయించడంతో అంబులెన్స్ వాహనాలు జిల్లా అధికార యంత్రాంగ్రానికి అందాయి. కార్యక్రమంలో జెడ్పీ ప్రెసిడెంట్ సస్మితా మెలక, ఎమ్మెల్యేలు తారాప్రసాద్ బాహిణీపతి, పవిత్ర శాంత, రఘురాం మచ్చో, రుఫుదర్ బొత్రాలు పాల్గొన్నారు.
అధ్యక్ష పదవికి నవీన్ నామినేషన్
కొరాపుట్: బిజూ జనతా దళ్ అధ్యక్ష పదవికి మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. భువనేశ్వర్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఎన్నికల రాష్ట్ర రిటర్నింగ్ అధికారి ప్రతాప్ కేసరి దేవ్‌కి నామినేషన్ పత్రాలు అందజేశారు. నవీన్ ఒక్కరే అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. 1997లో దివంగత మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ మృతి చెందారు. అనంతరం నవీన్ పట్నాయక్ జనతా దళ్ పార్టీ నుంచి బయటకు వచ్చి 1998లో బీజేడీని స్థాపించారు. అప్పటినుంచి ఆయనే అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. తమ అధినేత నవీన్ ఇది వరుసగా 9వసారి నామినేషన్ దాఖలు చేయడమని సీనియర్ నాయకుడు బృగు భక్షిపాత్రో పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బబి దాస్, దేవి మిశ్ర, సంజయ్ దాస్ వర్మ, చంద్రశేఖర్ సాహు, ప్రమిలా మాలిక్, విక్రమ అరుఖ్ తదితరులు పాల్గొన్నారు.
కేరళలో వలస కార్మికుడు మృతి
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్ హరిజన వీధికి చెందిన ఉశాంత్ కుమార్ మల్లి (38) అనే వలస కార్మికుడు కేరళలో కోచి జిల్లా అటోని వద్ద బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. పేద కుటుంబానికి చెందిన ఉశాంత్ కుమార్ మల్లి కొన్ని నెలలుగా కేరళ రాష్ట్రం కోచిలోని ఒక ప్రైవేటు హోటల్‌లో పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని జిల్లా శ్రామిక అధికారి, మోహానా అధికారుల ఆర్థిక సాయంతో గురువారం హరిజన వీధికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. పేద కుటుంబానికి చెందిన ఉశాంత్ కుమార్ మల్లి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని కలెక్టర్‌ను మృతుని కుటుంబీకులు కోరుతున్నారు.
కింగ్‌కోబ్రా కలకలం
రాయగడ: జిల్లాలోని కొలనారలోని ఓ స్టోన్‌క్రషర్ పవర్ జనరేటర్ గదిలో కింగ్‌కోబ్రా కలకలం సృష్టించింది. గురువారం ఉదయం ఎప్పటిలాగే క్రషర్ మెషీన్‌ను ఆపరేట్ చేసేందుకు జనరేటర్ గదిలోకి వెళ్లిన సిబ్బందికి గదిలో ఓ మూల పాము బుసలు కొడుతూ కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా పామును చూసి బయటకు పరుగులు తీశారు. అనంతరం స్థానిక స్నేక్ స్నేచర్ ప్రదీప్ సేనాపతి సంఘటన స్థలానికి చేరుకుని సుమారు గంటపాటుగా శ్రమించి పాముని పట్టుకున్నాడు. సమారు 13 అడుగుల కింగ్ కోబ్రా పాముగా గుర్తించారు. పట్టుకున్న అనంతరం సమీపంలొ గల అడవుల్లో విడిచిపెట్టినట్లు సేనాపతి తెలియజేశారు.
6 అంబులెన్స్‌ల వితరణ


