నబరంగ్‌ఫూర్ బీజేడీ అధ్యక్షుడిగా మనోహర్
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా బీజేడీ అధ్యక్షుడిగా డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారిని పార్టీ నియమించింది. మంగళవారం రాత్రి పార్టీ అధిష్టానం తొలి విడతగా 18 జిల్లాల అధ్యక్షుల జాబితాని విడుదల చేసింది. పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉన్న ప్రతాప్ కేసరి దేవ్ ఈ వివరాలు ప్రకటించారు. అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి కేవలం మనోహర్ రంధారి ఒక్కరే బీజేడీ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
మహిళలకు రక్షణ కల్పించాలి
మల్కన్‌గిరి: జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళవారం మా అమ్మ గౌరవం–మన గర్వం అనే నినాదంతో భారీ ర్యాలీని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 9 నెలల్లో 20 వేల మంది మహిళలు, చిన్నారులు, యువతులపై లైంగిక దాడులు జరిగాయన్నారు. మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోవింద పాత్రో, చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
కాంగ్రెస్‌లోకి పులువురి చేరిక
రాయగడ: జిల్లాలోని మునిగుడలో బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక ఆధ్వర్యంలో మంగళవారం బీజేడీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిసంకటక్ ఐబీ ప్రాంగణంలో జరిగిన ఈ చేరికల్లో శివపదర్ పంచాయతీకి చెందిన గొపాల కృష్ణ మాఝి, రాజు క్రడక, రాజారావు పొలకియ, రవీద్ర మహానందియా, మున్నా జకసిక, దీప జకసిక, సుశాంత్ మాఝి, మహేంద్ర మాఝి తదితర ప్రముఖులు కాంగ్రెస్‌లో చేరారు. వీరితోపాటు పలువురు బీజేడీ కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
బాక్సింగ్ పోటీల్లో చరణ్‌కు కాంస్యం
శ్రీకాకుళం న్యూకాలనీ: యూత్ బాక్సింగ్ పోటీల్లో సిక్కోలు కుర్రాడు ఎ.చరణ్‌కుమార్ సత్తాచాటాడు. విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 14 తేదీల్లో జరిగిన 7వ ఏపీ రాష్ట్రస్థాయి యూత్ మెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో లైట్ మిడిల్ వెయిట్ విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. శ్రీకాకుళంలోని మాస్టర్స్ మైండ్స్ వారియర్స్(ఎంఎండబ్ల్యూ) బాక్సింగ్ క్లబ్‌కు చెందిన ఈ కుర్రాడు కోచ్ కె.పురుషోత్తంరావు పర్యవేక్షణలో ఇటీవల అనేక బాక్సింగ్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించాడు. తాజాగా కాంస్య పతకం సాధించడం పట్ల బాక్సింగ్‌క్లబ్ అధ్యక్షుడు టి.తారకనాథ్, కార్యదర్శి బి.సురేష్‌కుమార్, కోచ్ పురుషోత్తం, క్లబ్ ప్రతినిధులు, డీఎస్‌డీఓ డాక్టర్ శ్రీధర్‌రావు తదితరులు హర్షం వ్యక్తంచేశారు.
సన్నధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సిందే
పోలాకి: ‘చిన్నబోయిన సన్నాలు’ శీర్షికన మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో పలు మిల్లుల్లో సన్నధాన్యం, బియ్యం, నూకలు తదితర స్టాకులను తనిఖీ చేశారు. వాటా, నిల్వ తదితర అంశాలను తెలియజేసే ఏ, బి రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా వ్యవసాయశాఖ అధికారులకు సైతం క్షేత్రస్థాయిలో వార్తకు సంబంధించిన అంశంపై ఉన్నతాధికారులు వివరణ కోరినట్లు తెలిసింది. కాగా, రబీకి అందివచ్చిన సన్నధాన్యం ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయడానికి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు లేవని అధికారులు తెలిపారు. ఏదిఏమైనా ప్రభుత్వం ఎగుమతులకు అనుమతిస్తే తప్ప ధాన్యం కొనుగోలులో అనుకున్న స్థాయి మార్కెట్‌ధర పలకదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.
నబరంగ్‌ఫూర్ బీజేడీ అధ్యక్షుడిగా మనోహర్
నబరంగ్‌ఫూర్ బీజేడీ అధ్యక్షుడిగా మనోహర్
నబరంగ్‌ఫూర్ బీజేడీ అధ్యక్షుడిగా మనోహర్
నబరంగ్‌ఫూర్ బీజేడీ అధ్యక్షుడిగా మనోహర్


