గవర్నర్‌ను కలిసిన మల్కన్‌గిరి ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన మల్కన్‌గిరి ఎమ్మెల్యే

Apr 15 2025 1:56 AM | Updated on Apr 15 2025 1:56 AM

గవర్న

గవర్నర్‌ను కలిసిన మల్కన్‌గిరి ఎమ్మెల్యే

మల్కన్‌గిరి: భువనేశ్వర్‌లో గవర్నర్‌ హరిబాబును మల్కన్‌గిరి ఎమ్మెల్యే సోమవారం కలిసి ఒడియా నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఉన్న పలు గిరిజన తెగలకు అందాల్సిన సంక్షేమ పథకాలు గూర్చి చర్చించారు. వారి అభివృద్ధికి జిల్లాలో పర్యటించాలని ఆహ్వానించారు

మూడు ఇళ్లల్లో ఒకేసారి దోపిడీ

పర్లాకిమిడి: జిల్లాలో కాశీనగర్‌ సమితి గోరిబంద పంచాయతీ కురిగాం గ్రామంలో మూడు ఇళ్లల్లో ఆదివారం ఒకేసారి చోరీ జరిగింది. బంగారం, నగదు దోచుకున్నట్టు కాశీనగర్‌ ఐఐసీ సునీల్‌ కుమార్‌ బెహరా సోమవారం తెలియజేశారు. గోరిబంద పంచాయతీ ఖురిగాంలోని ఆర్‌.సావిత్రి ఇంట్లో రాత్రి దోంగలు పడి మహిళ మెడలో రెండు తులాల మంగళసూత్రం దోచుకున్నారు. బి.తవిటినాయుడు, పి.కళావతి ఇళ్లల్లో రూ.40 వేల నగదు, బంగారం దోచుకుని పారిపోయారు. దీనిపై కాశీనగర్‌ పోలీసు ఠాణా అధికారి సునీల్‌ కుమార్‌ బెహరా సంఘటనా స్థలానికి విచ్చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దీనిపై కాశీనగర్‌ పోలీసు ష్టేసన్‌లో కేసు నమోదు చేశారు.

చలివేంద్రం ఏర్పాటు

రాయగడ: జేకేపూర్‌ రోడ్డుకు వెళ్లే మార్గంలో గల రిలయన్స్‌ మార్ట్‌ వద్ద స్థానిక సాయిప్రియ వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాటసారులకు తాగునీటి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని క్లబ్‌ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ సురేష్‌ కుమార్‌, కె.రమేష్‌, కె.ధర్మరాజు, తదితరులు ప్రారంభించారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దీనిని ఏర్పాటు చేయడం జరిగిందని క్లబ్‌ సభ్యులు తెలిపారు.

సామాజిక న్యాయమే లక్ష్యం

ఎచ్చెర్ల క్యాంపస్‌: సామాజిక న్యాయమే లక్ష్యంగా డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ముందుకు సాగారని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ (ఎస్‌ఆర్‌సీ) హానరీ ప్రొఫెసర్‌ బి.సుధాకర్‌రెడ్డి అన్నారు. ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో సోమవారం ‘విస్మరించబడిన వర్గాలకు సాధికారిత’ అనే అంశంపై రెండు రోజుల సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ మార్గం అనుసరణీయమన్నారు. ప్రపంచ మేధావుల్లో అంబేడ్కర్‌ అగ్రస్థానంలో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో వీసీ రజిని, వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.

బొలెరో ఢీకొని

వ్యక్తికి గాయాలు

టెక్కలి రూరల్‌: స్థానిక మండపొలం కాలనీ సమీపంలో పాత జాతీయ రహదారిపై సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చేరివీధికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు జి.సింహాద్రి సైకిల్‌పై మండపొలం కాలనీ నుంచి తన వీధి వైపు వెళ్తుండగా వెనుక నుంచి బొలెరొ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సింహాద్రికి తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన టెక్కలి జి ల్లా ఆస్పత్రికి తరలించారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

గవర్నర్‌ను కలిసిన   మల్కన్‌గిరి ఎమ్మెల్యే 1
1/1

గవర్నర్‌ను కలిసిన మల్కన్‌గిరి ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement